Hema | సినీ నటి హేమపై మా సస్పెన్షన్ ఎత్తివేత.. మీడియాతో మాట్లాడవద్దని షరతు
సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కొద్ది రోజుల కిందట హేమ పేరు ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరకడం, ఆమె బ్లడ్ శాంపిల్స్ చెక్ చేస్తే పాజిటివ్‌గా రావడంతో న్యూస్ ఛానెల్స్ లో హేమ పేరు మారుమ్రోగింది

Hema | సినీ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (MAA) విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కొద్ది రోజుల కిందట హేమ పేరు ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరు (Bangalore)లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party)లో హేమ దొరకడం, ఆమె బ్లడ్ శాంపిల్స్ చెక్ చేస్తే పాజిటివ్‌గా రావడంతో న్యూస్ ఛానెల్స్ లో హేమ పేరు మారుమ్రోగింది. కాగా.. బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారంలో హేమపై వేటు వేసిన మా అసోసియేషన్ తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మీడియాతో మాట్లాడ వద్దని హేమకు మా షరతు విధించింది.
అయితే అసలు ఏం జరిగిందో తాను వివరిస్తానని అంటున్నా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్లు వార్తలు రాసేసారు. బ్రేకింగ్ న్యూస్‌లతో బెంబేలెత్తించారు. ఇక ఇటీవల హేమ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఆ నాటి పరిస్థితుల గురించి క్లారిటీ ఇచ్చింది. తాను రేవ్ పార్టీకే వెళ్లలేదని.. బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాలని అని పేర్కొంది. బెంగుళూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం, రక్త పరీక్షల్లో ఆమెకు నెగటీవ్ రావడంతో మా అసోసియేషన్ హేమపై విధించిన సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంది.
బెంగళూరు రేవ్ పార్టీతో హేమ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హేమ ఈ పార్టీకి స్వయంగా హాజరవటమే కాకుండా, ఆ తరువాత అదే ఫామ్ హౌస్ నుండే ఒక వీడియో చేస్తూ తాను అక్కడ లేనని, హైదరాబాద్‌లో బిర్యానీ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫామ్‌హౌస్ నుంచి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో ఉందని ఖరారు చేశారు. అయినప్పటికీ తాను లేనని బుకాయించే ప్రయత్నంలో భాగంగా హేమ బిర్యానీ తయారు చెయ్యడం గురించి ఇంకో వీడియో పెట్టింది. అప్పటికే నెటిజన్స్ ఆమెని ట్రోల్ చెయ్యడం మొదలెట్టేసారు.
హేమని పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా హేమ పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ఎక్కువగా వివాదాలతో వార్తలలోకి ఎక్కుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వచ్చినప్పుడు ఆమె తాను హైదరాబాద్ లో ఉన్నట్టు, చికెన్ వండుతున్నట్టు చెప్పడం అభిమానులకి కూడా ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆమెపై సస్పెన్షన్‌ను మా ఎత్తివేసింది.