మంచు లక్ష్మికి అల్లు అర్జున్ కుమార్తె అర్హ షాక్!

అల్లు అర్జున్ కూతురు అర్హ, మంచు లక్ష్మిని "మీరు తెలుగు వారేనా?" అని అడిగిన పంచ్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారి ఫన్నీ సంభాషణ చూసి నెటిజన్లు ఆహ్లాదంగా నవ్వుకుంటున్నారు!

మంచు లక్ష్మికి అల్లు అర్జున్ కుమార్తె అర్హ షాక్!

విధాత : సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి హీరో అల్లు అర్జున్ కూతురు అర్హ తన మాటలతో షాక్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు లక్ష్మిని అర్హ అడిగిన ప్రశ్నతో తొలుత ఆశ్చర్యపోయిన ఆమె ఆ తర్వాత బిగ్గరగా నవ్వుకుంది. మంచు లక్ష్మితో ఆడుకుంటున్న అర్హ ఆమెను ‘మీరు తెలుగు వారేనా’ అని అర్హ అడిగింది. అర్హ ప్రశ్నతో షాక్ తిన్న మంచు లక్ష్మి ఎందుకు నీకు ‘నన్ను ఆ ప్రశ్న అడగాలనిపించింది’ అని తిరిగి ప్రశ్నించింది. ‘మీరు తెలుగు మాట్లాడే యాస చూస్తే అలా అడగాలని అనిపించింది’ అని అర్హ అనడంతో..నీది కూడా దాదాపుగా అలాగే ఉంటుంది కదా అంటూ మంచు లక్ష్మి బిగ్గరగా నవ్వుతూ అర్హను ముద్దుల్లో ముంచెత్తింది. తాను తెలుగు మాట్లాడే తీరుపై ఆర్హ విసిరిన పంచ్ కు మంచు లక్ష్మి నవ్వాపుకోలేకపోయింది.

అక్కడే ఉన్న అల్లు అర్జున్, సతీమణి స్నేహలు కూడా వారిద్దరి సంభాషణకు నవ్వుల్లో మునిగారు. ఈ వీడియో చూసిన వారు సైతం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మంచు లక్ష్మి తెలుగులో మాట్లాడే తీరు ఏ పరబాష వారెవరో తెలుగు మాట్లాడినట్లుగా ఉంటుంది. అందుకే అర్హ సైతం ఆమెకు అలాంటి ప్రశ్న వేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో చిన్ననాటి భరతుడి పాత్రలో నటించి తన డైలాగ్ లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.