Anasuya|అనసూయని అందరి ముందు డేట్‌కి అడిగిన నటుడు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ
Anasuya| ప్రతి పండుగకి కొన్ని టీవీ ఛానెల్స్ ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మరి కొద్ది రోజులలో దీపావళి పండుగ రానుండగా,ఈ వేడుక కోసం ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇందులో జబర్ధస్త్ ఆర్టిస్టులతో పాటు యాంకర్స్,సినీ సెలబ్స్, కమెడీయన్స్ అందు పాల్గొని తమ ఆట పాటలతో వినో

Anasuya| ప్రతి పండుగకి కొన్ని టీవీ ఛానెల్స్ ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మరి కొద్ది రోజులలో దీపావళి పండుగ రానుండగా,ఈ వేడుక కోసం ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇందులో జబర్ధస్త్ ఆర్టిస్టులతో పాటు యాంకర్స్,సినీ సెలబ్స్, కమెడీయన్స్ అందు పాల్గొని తమ ఆట పాటలతో వినోదం పంచారు. అయితే తాజాగా ‘ఈ దీపావళికి మోత మోగిపోద్ది’ అనే ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అనసూయ, మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ప్రత్యేక అతిథులుగా పాల్గొనడం విశేషం. ఇక వారితో పాటు హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, ఆటో రాంప్రసాద్ , బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సందడిచేశారు.
ప్రోమోలో పండుగ సెలెబ్రేషన్ ఒక ఊరేగింపులా గ్రాండ్ గా చేద్దాం అని పల్లవి ప్రశాంత్ అంటే అప్పుడు వెంటనే హైపర్ ఆది(Hyper aadi) మాట్లాడుతూ.. ఒకసారి ఊరేగింపు చేస్తేనే అంత రచ్చ అయింది.. ఈ ఊరేగింపులు మనకెందుకురా బుజ్జి అంటూ సెటైర్ వేయడం నవ్వులు పూయించింది. ఇక కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో పెద్దోడు పాత్రలో నటించిన ప్రసాద్‌ని కూడా ఈ షోకి తీసుకు వచ్చారు. అప్పుడు యాంకర్ శ్రీముఖి.. ఇక్కడున్న అమ్మాయిలలో ప్రొపోజ్ చేయాలంటే ఎవరికి చేస్తావు అని శ్రీముఖి అడిగింది. పొద్దున్న లేస్తే ఇంస్టాగ్రామ్లో అనసూయ వీడియోస్ చూస్తాను.. కాబట్టి ఆవిడకే ప్రొపోజ్ చేస్తాను అని షాకిచ్చాడు. దీనితో అనసూయ(Anasuya) సిగ్గుపడిపోతూ కనిపించింది
ఆక వెంటనే మోకాళ్లపై నిలబడి.. అనసూయగారు నాతో కాఫీ తాగడానికి డేట్ కి వస్తారా అని అడిగాడు. అనంతరం మంచు లక్ష్మీ ఇంగ్లీష్ పై సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ నడుస్తుందో మనం చూస్తూ ఉంటాం. అలా ట్రోలింగ్ జరిగినప్పుడు ఆమె పిల్లలు ఎంత అవమానికి గురవుతారో. ఆ సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఒక స్కిట్ చేశారు. ఇ సమయంలో మంచు లక్ష్మీ చాలా ఎమోషనల్ అయింది. అలానే అనసూయకి, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కి మధ్య విభేదాలు ఏ రేంజ్‌లో హైలైట్ అయ్యాయో మనం చూశాం. ఇప్పటికీ దానికి ముగింపు పడడం లేదు. దీంతో ఈ షోలో శ్రీముఖి అనసూయని ఆ వివాదం గురించి అడిగింది. దాంతో అనసూయ వివరణ ఇచ్చింది. అయితే పూర్తి క్లారిటీ అక్టోబర్ 31న రానుంది.