Keerthy Suresh | బెస్ట్ డ్యాన్సర్ అతనేనన్న కీర్తి సురేశ్.. ట్రోల్ చేస్తున్న చిరు ఫ్యాన్స్..!
Keerthy Suresh | చెన్నై బ్యూటీ కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నేను శైలజా మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను లోకల్ మూవీ హిట్‌తో తెలుగులో స్థిరపడింది. ఇక ‘మహానటి’ మూవీతో స్టార్‌డమ్‌ను తీసుకువచ్చింది.

Keerthy Suresh | చెన్నై బ్యూటీ కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నేను శైలజా మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను లోకల్ మూవీ హిట్‌తో తెలుగులో స్థిరపడింది. ఇక ‘మహానటి’ మూవీతో స్టార్‌డమ్‌ను తీసుకువచ్చింది. ఈ మూవీలో కీర్తి సురేశ్ నటకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. అలనాటి తార సావిత్రి బయోపిక్‌లో నిజంగా సావిత్రి పాత్రకు జీవం పోసింది. ఆ తర్వాత పలు మూవీల్లో పరాజయం దక్కినా.. వరుస మూవీలతో దూసుకుపోతున్నది. ఇటీవల నాని హీరోగా వచ్చిన దసరా మూవీతో మళ్లీ విజయాల బాట పట్టడంతో వరుస ఆఫర్లు వస్తున్నది.
అయితే, ఇటీవల కీర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళస్టార్ విజయ్ దళపతితో ప్రేమలో మునిగి తేలుతుందని ప్రచారం జరిగింది. ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, దళపతి విజయ్‌లో ఎవరు బెస్ట్ డ్యానర్స్ కీర్తి సురేశ్‌కి ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి స్పందిస్తూ.. విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అంటూ సమాధానమిచ్చింది. దాంతో చిరంజీవి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. చిరంజీవికి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు ఎప్పుడూ ట్రోల్స్ వస్తూనే ఉటాయి. ఈ క్రమంలో కీర్తిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.