Mega vs Allu| మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు
Mega vs Allu| ఏపీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీకి చెందిన అందరు హీరోలు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయగా, అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్‌కు బద్ధ శత్రువైన వైఎస్ జగన్ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఏకంగా నంద్యాల వెళ్లి మరీ ఆయనకి ప్రచారం చేయడం ఎ

Mega vs Allu| ఏపీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీకి చెందిన అందరు హీరోలు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయగా, అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్‌కు బద్ధ శత్రువైన వైఎస్ జగన్ పార్టీకి చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఏకంగా నంద్యాల వెళ్లి మరీ ఆయనకి ప్రచారం చేయడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. నాగబాబు అయితే ఇన్‌డైరెక్ట్‌గా బన్నీకి చురకలు అంటించాడు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్‌ఫాలో చేశాడు. మరోవైపు పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్‌లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించకపోవడంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ జోరుగా ప్రచారం సాగింది.
ఈ ప్రచారాలపై ఇంత వరకు ఎవరు స్పందించింది లేదు. రెండు ఫ్యామిలీలకి అత్యంత సన్నిహితంగా ఉండే బన్నీ వాసు తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ ఆయ్ ‘ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా, ఈ చిత్ర థీమ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా మీట్‌లో మెగా, అల్లు ఫ్యామిలీల విబేధాల గురించి కూడా బన్నీ వాసు మాట్లాడాడు… ఫ్యామిలీ అన్నాక కొన్ని అనుకోని పరిస్ధితులు వస్తాయని చెప్పారు. తాను మెగా ఫ్యామిలీని, అందులోని వ్యక్తులను 20 ఏళ్లుగా తాను చూస్తూ ఉన్నానని ఆయన అన్నారు. చిరంజీవి గారు తమ కుటుంబం ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతుంటారు.
ప్రతి ఏడాది కూడా సొంత ఖర్చుతో కుటుంబం మొత్తాన్ని బెంగళూరుకు తీసుకెళ్లి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేస్తారు. అది చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఫ్యామిలీ అంతా కలిసుండాలన్నదే చిరంజీవి అభిమతమని బన్నీ వాసు తెలియజేశారు. కుటుంబంలో పిల్లలు ఎదిగారు. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే ఏది ఏం జరిగిన కూడా కుటుంబం మొత్తం ఏకతాటిపైనే ఉందనే మెసేజ్‌ను జనాల్లోకి పంపాలని చిరంజీవి తపిస్తుంటారని ఆయన చెప్పారు. కొందరి వ్యక్తిగత నిర్ణయాల వలన ఫ్యామిలీలో విచిత్ర పరిస్థితులు తలెత్తుతాయి. వాటిని ఫేస్ చేయక తప్పదు. అయితే ఇప్పుడున్న తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రజెంట్ సిట్యుయేషన్‌తో లింక్ చేయడం తెలివైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల బాండింగ్ ఏంటో నాకు తెలుసు. ఒకే ఒక్క సిట్యుయేషన్ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్ చెక్ పెట్టడానికి… నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాను. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇలాంటి రూమర్స్…ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంటూ బన్నీ వాసు వివరణ ఇచ్చారు.