Kartik Aaryan| పాపం కోట్ల విలువ చేసే ఆ హీరో కారు ఎలుక‌ల‌ పాలు అయ్యిందిగా..!

Kartik Aaryan|  బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి త‌న టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోల‌లో కార్తీక్ ఆర్య‌న్ ఒక‌రు.. 2011లో వ‌చ్చిన‌ ప్యార్ కే పంచనామా సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తీక్ ఆర్య‌న్ .. ప్యార్ కా పంచనామా 2, సోనూ కే టిటు కీ స్వీటీ, లూకా చుప్పి, పతీ ప

  • By: sn    cinema    Jun 10, 2024 7:39 AM IST
Kartik Aaryan| పాపం కోట్ల విలువ చేసే ఆ హీరో కారు ఎలుక‌ల‌ పాలు అయ్యిందిగా..!

Kartik Aaryan|  బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి త‌న టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోల‌లో కార్తీక్ ఆర్య‌న్ ఒక‌రు.. 2011లో వ‌చ్చిన‌ ప్యార్ కే పంచనామా సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తీక్ ఆర్య‌న్ .. ప్యార్ కా పంచనామా 2, సోనూ కే టిటు కీ స్వీటీ, లూకా చుప్పి, పతీ పత్ని ఔర్ ఓ వంటి చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2022లో ఆయన నటించిన భూల్ బులియా 2 బ్లాక్ బస్టర్ విజ‌యం సాధించి మ‌నోడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే అదే ఏడాది విడుద‌లైన భారీ చిత్రాలు కూడా ఫ్లాప్ కాగా, ఒక్క భూల్ బులియా 2 మాత్ర‌మే మంచి విజ‌యం సాధించింది.

ఇక గతేడాది షెహజాదా (అల్లు అర్జున్ అల వైకుంఠపురం రీమేక్), సత్యప్రేమ్‌ కీ కథ చిత్రాలతో మంచి హిట్స్ కొట్టారు కార్తీక్ ఆర్య‌న్. అయితే భూల్ భూల‌య్యా 2 చిత్రంతో మంచి క‌లెక్ష‌న్స్ తెచ్చిపెట్టిన నేప‌థ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తీక్ ఆర్యన్ కి రూ. 4.72 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారును వాడకుండా గ్యారేజ్ లో ఉంచిన కార్తీక్ ఆర్యన్ కి పెద్ద షాకే త‌గిలింది. కోట్లు ఖరీదు చేసే ఈ లగ్జరీ కారును ఎలుకలు పాడు చేశాయంట‌. కారులోని మ్యాట్స్‌ని ఎలుక‌లు పాడు చేసాయ‌ట‌. ఆ మ్యాట్స్ వేయేంచేందుకే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు ఈ హ్యాండ్సమ్ హీరో.

ఇక కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం చందు ఛాంపియన్‌ అనే బయోపిక్ లో నటిస్తున్నాడు. భారత తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాపై మ‌నోడు భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. ఇక ఇటీవ‌ల కార్తీక్.. హీరోల రెమ్యున‌రేష‌న్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచాడు. సినిమా బడ్జెట్, నిర్మాత పరిస్థితిని బట్టి హీరోలు పారితోషికం తగ్గించుకుంటారని.. కొన్నిసార్లు రెమ్యునరేషన్ పూర్తిగా వదిలేస్తారంటూ చెప్పుకొచ్చాడు. తాను కూడా షెహజాదా సినిమాకు పారితోషకం తీసుకోలేదని కార్తీక్ తెలియ‌జేశాడు.