Mrunal Thakur | ప్రభాస్‌, హను రాఘవపుడి మూవీ ఆఫర్‌ని మృణాల్‌ ఠాకూర్‌ తిరస్కరించిందా..? ఇందులో నిజమెంత..?

Mrunal Thakur | మరాఠీ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ హిందీ సీనియర్‌లో నటించింది. ఆ తర్వాత మరాఠీ చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నది. ఇక లవ్‌ సోనియా మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో హను రాఘవపుడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ‘సీతా రామం’ మూవీలో మెరిసింది.

Mrunal Thakur | ప్రభాస్‌, హను రాఘవపుడి మూవీ ఆఫర్‌ని మృణాల్‌ ఠాకూర్‌ తిరస్కరించిందా..? ఇందులో నిజమెంత..?

Mrunal Thakur | మరాఠీ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ‘ముజ్సే కుచ్ కెహ్తీ…యే ఖామోషియాన్’ హిందీ సీనియర్‌లో నటించింది. ఆ తర్వాత మరాఠీ చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నది. ఇక లవ్‌ సోనియా మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో హను రాఘవపుడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ‘సీతా రామం’ మూవీలో మెరిసింది. ఈ చిత్రంలో సీతపాత్రలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. ఈ చిత్రం తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ ఓవర్‌నైట్‌ హీరోయిన్‌గా మారింది. అనంతరం బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలను చేసింది. నానీ సరసన ‘హాయ్‌ నాన్న, విజయ్‌తో ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రాల్లో వెరిసింది.

ప్రస్తుతం హిందీలో పలు వెబ్‌ సిరీస్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నది. అయితే, తాజాగా ఓ భారీ ఆఫర్‌ మృణాల్‌ ఠాకూర్‌ని అందుకుందని ప్రచారం జరుగుతుంది. పాన్‌ ఇండియా స్టాన్‌ ప్రభాస్‌ మూవీలో అవకాశం దక్కించుకుందని పెద్ద ఎత్తున టాక్‌ నడుస్తున్నది. అయితే, ఈ ప్రచారంపై మృణాల్‌ స్పందించింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రేమకథ నేపథ్యంలో మూవీ రాబోతుందని తెలుస్తుండగా.. ఇందులో మృణాల్‌ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ప్రభాస్‌తో మృణాల్‌ ఉన్న ఫొటోని ఓ నెటిజన్‌ షేర్‌ చేస్తూ హను రాఘవపుడి సినిమా పోస్టర్‌ లుక్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై మృణాల్‌ స్పందించింది. ఊహాగానాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి. ఈ మూవీలో తాను నటించడం లేదని పేర్కొంది.

దాంతో ప్రభాస్‌కు జోడీకిగా నటిస్తుందన్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లయ్యింది. అయితే, సమాచారం మేరక.. ఈ చిత్రంలో ముందుగా మృణాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారని.. కానీ, సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. సీతారామం మూవీ మృణాల్‌ కెరీర్‌ను మలుపుతప్పింది. మళ్లీ అదే దర్శకుడితో సెకండ్‌ హీరోయిన్‌గా చెస్తే తన ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి ఆఫర్‌ని తిరస్కరించినట్లు సమాచారం. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది మాత్రం తెలియరాలేదు. దీనిపై హను రాఘవపుడి.. లేదంటే మృణాల్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రభాస్‌, హను రాఘవపుడి మూవీలో కొత్త హీరోయిన్‌గా ఇమాన్‌ ఇస్మాయిల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. మూవీ పూజ కార్యక్రమాలతో శనివారం లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇమాన్‌ ఇస్మాయిల్‌ సైతం పాల్గొని సందడి చేసింది.