Nag Ashwin| కల్కి ప్రభాస్ కాదా.. నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానానికి అందరి మైండ్ బ్లాక్..!
Nag Ashwin| గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ . నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్‌గా రూపొంది మంచి విజయం సాధించింది. తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్

Nag Ashwin| గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ . నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్‌గా రూపొంది మంచి విజయం సాధించింది. తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఈ వారంలో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుందని, బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండడం ఖాయమని అంటున్నారు. అయితే మూవీ సక్సెస్ సాధించిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు నాగ్ అశ్విన్. మూవీ సెకండ్ పార్ట్‌పై ఇంకా పని చేయాల్సి ఉంది. ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై క్లారిటీ లేదు. సినిమాలో మహాభారతం ఎలిమెంట్లని చూపించిన నేపథ్యంలో రెండో పార్ట్ లోనూ ఆయా పాత్రలు, ఆ కథతోనే మూవీ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక తనకు మహాభారతంపై సినిమా చేసే ఆలోచన లేదన్నారు. చిత్రంలో కర్ణుడి పాత్ర గురించి మాట్లాడిన నాగ్ అశ్విన్.. సినిమా కోసం ఆ పాత్రని పుట్టించినట్టు చెప్పుకొచ్చాడు. ఇక కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే దానిపై ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆ పాత్రకి ఇంకా ఎవరినీ అనుకోలేదని , ప్రస్తుతం కథపరంగా కడుపులోనే పెరుగుతున్నాడు. పుట్టడానికి ఇంకా టైమ్ ఉందని చెప్పి అందరిని కన్ఫ్యూజన్‌లో పడేశాడు. కల్కి పాత్రనే సినిమాకి మెయిన్ హీరో కాగా, ఇప్పటి వరకు ఆ పాత్రకి ఎవరిని ఫిక్స్ చేయలేదని నాగ్ అశ్విన్ చెప్పడంతో అందరిలో లేని పోని అనుమానాలు తలెత్తుతున్నాయి.సుప్రీం యాస్కిన్‌తో కల్కినే ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో ప్రభాస్‌ని కాకుండా ఇతర హీరోని తీసుకుంటే మాత్రం జస్టిఫికేషన్ ఏ మాత్రం ఉండదు.
నాగ్ అశ్విన్ మాత్రం ఇంకా ఎవరిని ఎంపిక లేదని చెప్పడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా కోసం మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంభల స్టెప్స్. అక్కడే కూర్చునే వాడిని. అక్కడ సైన్ రైజ్, సన్ సెట్ చాలా బావుంటుంది అని చెప్పాడు నాగ్ అశ్విన్. కృష్ణుడి పాత్రలో మహేష్ బాబుని తీసుకుంటే బాగుండేదని రిపోర్ట్స్ అనగా, దానికి స్పందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కాదు కాని వేరే సినిమాలో ఆయన కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుందని నాగ్ అశ్విన్ తెలియజేశారు.