Naga Chaitanya Sobhita Dhulipala|మరి కొద్ది గంటలలో నాగ చైతన్య- శోభిత నిశ్చితార్థం.. అసలు వీరిద్దరికి ఎప్పుడు, ఎక్కడ పరిచయం ఏర్పడింది..!
Naga Chaitanya Sobhita Dhulipala| కొన్నేళ్ల క్రితం సమంత రూత్ ప్రభును ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య ఊహించని విధంగా 2021లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఇక అప్పటి నుండి సోలోగా ఉంటూ వస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని జోరుగా ప్రచా

Naga Chaitanya Sobhita Dhulipala| కొన్నేళ్ల క్రితం సమంత రూత్ ప్రభును ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య ఊహించని విధంగా 2021లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఇక అప్పటి నుండి సోలోగా ఉంటూ వస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని జోరుగా ప్రచారాలు సాగాయి.ఆ హీరోయిన్ మరెవరో కాదు శోభిత దూళిపాళ్ల. అయితే శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నా కానీ, అటు చైతూ కాని, ఇటు హీరోయిన్ శోభిత గానీ ఏ మాత్రం స్పందించలేదు. ఓ సారి తామిద్దరం ఫ్రెండ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది.
తాజాగా నాగ చైతన్య-శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఈ రోజు చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో చాలా ప్రైవసీతో చైతూ శోభితా ఎంగేజ్‌మెంట్ జరగనుందని ఓ న్యూస్ తెగ హల్‌చల్ అవుతోంది. ఇటు బాలీవుడ్ సినీ వర్గాల్లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ న్యూస్ వైరల్ అవుతుండగా, దీనిపై అక్కినేని ఫ్యామిలీ కాని, శోభిత కాని స్పందించింది లేదు. అయితే నాగార్జుననే ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసి దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తాడని అంటున్నారు. అయితే చై, శోభితల నిశ్చితార్థంకి సంబంధించి జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అసలు వీరిద్దరికి పరిచయం ఎప్పుడు, ఎలా ఏర్పడింది అనే దానిపై తెగ ఆరాలు తీస్తున్నారు.
అడవి శేష్ నటించిన మేజర్ సినిమా షూటింగ్ సమయంలో చైతూ, శోభిత కలిసారని ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం జరిగిందని టాక్. పరిచయం ఏర్పడిన తర్వాత చాలా సార్లు ఇద్దరు మాట్లాడుకోవడం.. చాట్ చేసుకోవడం వంటివి జరిగాయని అంటున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి ఇది పెళ్లి వరకు వచ్చిందని చెప్పుకొస్తున్నారు. కాగా శోభితా ధూళిపాళ గూఢచారి సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీసుల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర కూడా వేసుకుంది.