Naga Chaitanya|నాగ చైత‌న్య‌, శోభిత ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్సైందా.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Naga Chaitanya| అక్కినేని హీరో నాగ చైత‌న్య కొన్నాళ్ల పాటు స‌మంత‌ని ప్రేమించి ఎట్ట‌కేల‌కి 29 జ‌న‌వ‌రి 2017న ఆమెని పెళ్లి చేసుకున్నారు. అట్ట‌హాసంగా వారిద్ద‌రి పెళ్లి జ‌రిగింది. ఇక కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం స‌జావుగానే సాగింది. ఈ జంట‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా క్యూట్ పెయిర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు

  • By: sn    cinema    Aug 08, 2024 9:45 AM IST
Naga Chaitanya|నాగ చైత‌న్య‌, శోభిత ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్సైందా.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Naga Chaitanya| అక్కినేని హీరో నాగ చైత‌న్య కొన్నాళ్ల పాటు స‌మంత‌ని ప్రేమించి ఎట్ట‌కేల‌కి 29 జ‌న‌వ‌రి 2017న ఆమెని పెళ్లి చేసుకున్నారు. అట్ట‌హాసంగా వారిద్ద‌రి పెళ్లి జ‌రిగింది. ఇక కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం స‌జావుగానే సాగింది. ఈ జంట‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా క్యూట్ పెయిర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా వారిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకొని నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డం అభిమానుల‌కి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. వారిద్ద‌రు తిరిగి క‌లిస్తే బాగుండ‌ని చాలా మంది అనుకుంటున్నారు. కాని అది జ‌ర‌గ‌డం అసాధ్యమే. అయితే స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత నాగ చైతన్య .. శోభిత‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని త్వ‌ర‌లో వారిద్దరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.

 

చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఆ ఫోటోల‌ని శోభిత ధూళిపాళ లైక్ చేయడం అలానే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం అనేక అనుమానాలు క‌లిగించింది.మ‌రోవైపు ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్‌కి వెళ్ల‌గా అక్క‌డ ఓ రెస్టారెంట్‌లో వీరు దిగిన పిక్స్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసిన నెటిజ‌న్స్ ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌డం గ్యారెంటీ అని జోస్యాలు చెప్పారు. అయితే ఈ తాజాగా చై-శోభిత రిలేషన్​కు సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య వివాహ బంధంలోకి అడుగుపెట్టబ‌బోతున్నార‌ని టాక్. ఈ రోజు వీళ్ల ఎంగేజ్ మెంట్ ​కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు, స్నేహితులతో పాటు కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖుల మ‌ధ్య జ‌ర‌గ‌నుందని స‌మాచారం. ఇక ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి నాగార్జున అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని ఇన్‌సైడ్ టాక్. మ‌రి చూడాలి ఈ వార్త నిజం అవుతుందా లేదంటే పుకారుగానే మిగిలిపోతుందా అని. కాగా, నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది. మయోసైటిస్ నుండి కోలుకున్న త‌ర్వాత తిరిగి అదే ఉత్సాహంతో సినిమాలు చేసే ఆలోచ‌న చేస్తుంది.