Naga Chaitanya| ఆమెతో ఆ ప్రయాణం నా మ‌ది నుండి చెరిగిపోదు.. నాగ చైత‌న్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya| తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు కాని కొన్నాళ్ల‌కే ఇద్ద‌రి అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తు

  • By: sn    cinema    Jul 06, 2024 11:26 AM IST
Naga Chaitanya| ఆమెతో ఆ ప్రయాణం నా మ‌ది నుండి చెరిగిపోదు.. నాగ చైత‌న్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya| తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు కాని కొన్నాళ్ల‌కే ఇద్ద‌రి అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేప‌థ్యంలో సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. నాగ చైత‌న్య మాత్రం సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు.

స‌మంత చైతూ విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వ‌చ్చింది. వారిద్ద‌రు తిరిగి క‌లిస్తే బాగుండ‌ని ఎంతో మంది అనుకుంటున్నారు. అయితే అది దాదాపు అసాధ్య‌మే అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా చైతూ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చెన్నైలో పుట్టి పెరిగిన తాను డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్‌కి వచ్చేశారు. అయితే ఆ సమయంలో సమ్మర్ వెకేషన్‌కి ముంబై వెళ్లి ఎంజాయ్ చేసేవాడినని, అలాగే తాను చిన్నప్పుడు తన తల్లితో ట్రైన్‌లో ముంబైకి వెళ్లి.. మరోసారి తల్లితో పాటు హైదరాబాద్‌కు ట్రైన్ జర్నీ చేశారని తెలియ‌జేశాడు.

అయితే ఈ రెండు సార్లు చేసిన ప్ర‌యాణం త‌న‌కి ఎప్ప‌టికీ స్పెష‌ల్‌గా ఉంటుందని, త‌న మ‌న‌సు నుండి చెరిగిపోద‌ని చైతూ పేర్కొన్నాడు. ఇక ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా, ఎన్ని మిస్‌ చేసుకున్నా, చివరకి నా రిటైర్‌మెంట్ సమాయానికి గోవాలోనే అని నాగ చైత‌న్య అన్నాడు. 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవాకి షిఫ్ట్ అయిపోయి.. ఏడాదొక సినిమా తీసుకుంటూ అక్కడే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటున్నానని చైతన్య అన్నాడు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నానని నాగచైతన్య ఓ సందర్భంలో అన్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్వకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తుండ‌గా, ఇందులో మత్స్యకారుడి పాత్రలో న‌టించ‌నున్నారు. ఈ పాత్ర కోసం చైతూ పూర్తిగా మేకోవర్ అయ్యారు.