Naresh| చందు, పవిత్ర‌ల మ‌ర‌ణాల‌పై న‌రేష్ కామెంట్.. నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది..!

Naresh| కొద్ది రోజుల క్రితం మ‌ర‌ణించిన ప‌విత్ర జ‌యరాం, చందు త‌మ అభిమానుల‌కి, కుటుంబ స‌భ్యుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చారు. ఐదు రోజుల గ్యాప్‌తో ఈ ఇద్దరు మ‌ర‌ణించ‌డం అంద‌రిలో తీవ్ర విషాదం నింపింది. కొన్నాళ్లుగా ప‌విత్ర జ‌య‌రాం, చంద్ర‌కాంత్ ప్రేమ‌లో ఉండ‌గా వారిరివురు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు

  • By: sn    cinema    May 24, 2024 2:40 PM IST
Naresh| చందు, పవిత్ర‌ల మ‌ర‌ణాల‌పై న‌రేష్ కామెంట్.. నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది..!

Naresh| కొద్ది రోజుల క్రితం మ‌ర‌ణించిన ప‌విత్ర జ‌యరాం, చందు త‌మ అభిమానుల‌కి, కుటుంబ స‌భ్యుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చారు. ఐదు రోజుల గ్యాప్‌తో ఈ ఇద్దరు మ‌ర‌ణించ‌డం అంద‌రిలో తీవ్ర విషాదం నింపింది. కొన్నాళ్లుగా ప‌విత్ర జ‌య‌రాం, చంద్ర‌కాంత్ ప్రేమ‌లో ఉండ‌గా వారిరివురు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల‌ని అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా ఎదురైన రోడ్డు ప్ర‌మాదంలో ప‌విత్ర జ‌య‌రాం క‌న్నుమూసారు. ఆమె మ‌ర‌ణంతో కుమిలిపోయిన చంద్ర‌కాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. వీరి మ‌ర‌ణాలు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇదే క్ర‌మంలో సీనియ‌ర్ న‌టుడు చందు-పవిత్ర మరణంపై స్పందించారు.

మ‌న‌కు స‌ర్వస్వం అనుకునేవారు దూర‌మైతే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. అది ఊహించ‌డానికి చాలా క‌ష్టంగా ఉంటుంది. ఆ స‌మ‌యంలో మ‌న‌ల్ని ఓదార్చ‌డానికి ప‌క్క‌న ఎవ‌రు లేక‌పోతే తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ‌తాము.గ‌తంలో ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి కాబ‌ట్టి ఒకరికి క‌ష్ట‌మొస్తే ఇంకొకళ్లు ఓదార్చేవాళ్లు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మా అమ్మ విజయనిర్మలమ్మ చనిపోయినపుడు నేను, కృష్ణ గారు ఎంతో బాధపడ్డాం. ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చేవారు.. నేను ఆయన్ని ఓదార్చేవాన్ని. అలా అమ్మ పోయిన బాధ నుంచి కొంతకాలానికి మేం బయటికి వచ్చాం అని న‌రేష్ చెప్పుకొచ్చారు.

మ‌నం ప్రాణంగా ప్రేమించిన వారు మ‌న క‌ళ్ల ముందు చనిపోతే వారి జ్ఞ‌పాకాలు చాలా కాలం ఉంటాయి. అయితే వారి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక చాలా మ‌న‌స్థాపానికి గురై తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ఆ స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల స‌పోర్ట్ చాలా అవ‌స‌రం. బిజీ లైఫ్ ప‌క్క‌న పెట్టి వారితో ఉంటే మంచిది. ప‌రిస్థితులు మారాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. నటి పవిత్ర మరణం దగ్గర నుంచి చూస్తే చంద్రకాంత్ తీవ్ర మనస్థాపానికి గురై ఒంటరి చాలా బాధ‌ప‌డి ఉంటాడు. ఆ బాధ‌తోనే అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉంటాడ‌ని న‌రేష్ కామెంట్ చేశారు. న‌రేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.