Devara OTT | ఎన్టీఆర్‌ ‘దేవర’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి తెలుసా..?

Devara OTT | ఎన్టీఆర్‌ ‘దేవర’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి తెలుసా..? Devara OTT | జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న మూవీ దేవర (Devara). పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానున్నది. ఇప్పటికు తెలుగు రాష్ట్రాలతో అంతా అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌ మొదలవగా టికెట్స్‌ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, నార్త్‌ బెల్ట్‌లోనూ భారీగా వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

Devara OTT | ఎన్టీఆర్‌ ‘దేవర’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి తెలుసా..?

Devara OTT | జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న మూవీ దేవర (Devara). పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానున్నది. ఇప్పటికు తెలుగు రాష్ట్రాలతో అంతా అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌ మొదలవగా టికెట్స్‌ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, నార్త్‌ బెల్ట్‌లోనూ భారీగా వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, టీజర్స్‌ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ మూవీతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. అలాగే, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రతినాయకుడిగా కనిపిస్తుండడం మూవీపై మరింత క్రేజ్‌ పెరిగింది.

ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీగా మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీని ఎక్కువ రోజులు థియేటర్లలోనే నడిపించాలని.. కనీసం ఏడువారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని నిబంధనను మేకర్స్‌ విధించినట్లు తెలుస్తున్నది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన కల్కీ మూవీ సైతం ఎక్కువ రోజులు థియేటర్లలోనే నడిచింది. అమెజాన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆలస్యంగా రిలీజ్‌ చేశారు. ఈ క్రమంలోనే దేవర మూవీని సైతం ఏడువారాల తర్వాత రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి కరోనా అనంతరం జనాలు ఎక్కువగా థియేటర్ల వైపు చూడడం లేదు. దాదాపు సినిమాలన్నీ మూడునాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో చాలామంది థియేటర్ల కంటే ఓటీటీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓటీటీల వైపు ప్రేక్షకులు దృష్టి సారించడానికి కారణాలు సైతం లేకపోలేదు. థియేటర్లలో టికెట్ల ధరలు, ఇతర ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. దాంతో అందరూ ఓటీటీల వైపే మక్కువ చూపిస్తున్నారు. ఓటీటీలో మూవీ రిలీజ్‌ ఆలస్యమైతే పలువురు థియేటర్లకు వెళ్లే అవకాశం ఉండడంతో మేకర్స్‌ రిలీజ్‌ని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ క్రమంలో దేవర టీం సైతం ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు టాక్‌. ప్రస్తుతం చాలా రోజుల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ సోలోగా 2018లో అరవింద సమేత వీర రాఘవరెడ్డి మూవీలో నటించారు. రెండేళ్ల కింద రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నటించారు. ఈ మూవీతో గ్లోబల్‌ స్టార్‌గా ఎన్టీఆర్‌ ఎదిగాడు. చాలారోజుల తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ సోలోగా నటిస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. నార్త్‌లో మేకర్స్‌ సొంతంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించారు. నార్త్‌లో రూ.50కోట్ల టార్కెట్‌తో దేరవ బరిలోకి దిగబోతుండగా.. కొద్ది గంటల్లోనే లక్ష్యాన్ని చేరుకుంటాడా? లేదా అన్నది తేలనున్నది. దేవరలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఇందులో కొడుకు క్యారెక్టర్‌కు జాన్వీ జోడీగా కనిపించనున్నది. తండ్రి పాత్రకు మరాఠీ బ్యూటీ నటించనున్నట్లు తెలుస్తున్నది. మూవీలో ప్రతిపాత్ర కీలకమని.. ఈ క్రమంలోనే సినిమాను రెండు పార్టులుగా తీసుకువస్తున్నట్లు ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.