Rashmika| వయనాడ్ బాధితుల కోసం రష్మిక అన్ని లక్షల సాయం చేసిందా.. అయిన ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.
Rashmika| కేరళ ప్రకృతి బీభత్సం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ ఘోరకలిలో మరణించిన వారి సంఖ్య 344 కు పెరిగింది. మరో

Rashmika| కేరళ ప్రకృతి బీభత్సం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ ఘోరకలిలో మరణించిన వారి సంఖ్య 344 కు పెరిగింది. మరో 281 మంది ఆచూకీ గల్లంతైంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు 3, 4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు. రాడార్ టెక్నాలజీతో కొందరి మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా జరుపుతుంది. ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద.. ప్రాణాలతో చిక్కుకున్నారని థర్మల్ స్కానర్ అలర్ట్ చేయడంతో.. అక్కడ 3 మీటర్ల లోతు తవ్వారు. 5 గంటల పాటు గాలింపు చేపట్టినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు.
వయనాడ్ బాధితులను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.ఇక బాధితులకి అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్షలు ఇస్తున్నారు. సూర్య, జ్యోతిక, కార్తీలు 50 లక్షలు ఇవ్వగా.. దుల్కర్ సల్మాన్ 10, ముమ్మట్టి 15, కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే టాలీవుడ్ నుంచి నాగవంశీ 5 లక్షల విరాళం అందించగా, తాజాగా రష్మిక 10 లక్షలు విరాళం ఇచ్చింది.అయితే అంత భారీ విరాళం అందించిన కూడా ఆమెని ట్రోల్ చేయడం కొందరికి ఆశ్చర్యంగా ఉంది.
అయితే కన్నడ భామ అయిన రష్మికని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే.. కొడుగు గాట్ సెషన్‌లలో.. భూమి క్షీణత జరగుతోంది. దీనిపై స్పందించాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో అభ్యర్థిస్తున్నారు. భూమి క్షీణించడం వల్ల అక్కడ కూడా కొండచరియలు విరిగిపడి.. చాలా మంది మృత్యువాత పడడం జరిగింది. కొందరు ఇళ్లు కూడా కోల్పోయారు. అయితే వారి విషయంలో స్పందించకుండా.. ఇప్పుడు కేరళ వయనాడ్ బాధితులను ఆదుకోవడం కోసం విరాళం ఇవ్వడాన్ని.. కొందరు నెటిజనులు తట్టుకోలేక రష్మికని ట్రోల్ చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇదే కాక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా నటిస్తుంది.