Renu Desai| నా మాజీ భర్తని అన్నింట్లో ఎందుకు లాగుతున్నారు.. ఆయనకి ప్రేమ లేదు..!
Renu Desai| రేణూ దేశాయ్ పెద్దగా సినిమాలు చేసింది లేదు. కేవలం పవన్ కళ్యాణ్ భార్య అన్న పేరుతో ఆమె హైలైట్ అయింది. ఇక పవన్ నుండి విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్న రేణూ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉండడంతో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇ

Renu Desai| రేణూ దేశాయ్ పెద్దగా సినిమాలు చేసింది లేదు. కేవలం పవన్ కళ్యాణ్ భార్య అన్న పేరుతో ఆమె హైలైట్ అయింది. ఇక పవన్ నుండి విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్న రేణూ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉండడంతో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కొందరు ఆమెని వదినా అనే పిలుస్తున్నారు. ఆమెకు అండగా నిలుస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ రూ. 3500 రూపాయలు సాయం చేయాలంటూ కోరింది. దీనికి భారీగానే స్పందన వచ్చింది. అయితే కొన్ని సార్లు రేణూ దేశాయ్ ఏ పని చేసిన పవన్ తో పోలుస్తూ కామెంట్ చేస్తుంటారు.
తాజాగా ఓ అభిమాని కా పవన్ కళ్యాణ్ అన్నలా మీది గోల్డెన్ హార్ట్ అని కామెంట్ చేశాడు. దీంతో రేణూ దేశాయ్‌కి చిర్రెత్తుకు రాగా, ఆమె ఘాటు రిప్లై ఇచ్చింది. నేను ఏ పోస్ట్ వేసినా సరే కొంత మంది మాత్రం నా మాజీ భర్తను లాగి.. అతనితో ఎందుకు నన్ను పోల్చుతున్నారు. యానిమల్ రెస్క్యూని గత పదేళ్ల నుంచి నేను చేస్తూనే ఉన్నా.. దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు.. ఇకపై అయినా నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి.. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు అని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో తెలియజేసింది. నేను ఈ మాటలు అన్నీ కోపంతో అనడం లేదు. బాధతో అంటున్నాను.
నేను కొన్నేళ్ల నుండి ఏ పనులు చేస్తున్నా కూడా మీరు క్షణాలలో క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. నాకు పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి సమస్య లేదు. కాకపోతే ఆయన ఫాలోవర్స్ మాత్రి నా ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉంటే బాగుంటుంది అని రేణూ దేశాయ్ పేర్కొంది. గతంలోనూ రేణూ దేశాయ్ ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. అయినా పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.