Nidhhi Agerwal | హీరోయిన్ నిధీ అగర్వాల్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంపై రచ్చ..?

హీరోయిన్ నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనం వినియోగం వివాదం రేగింది. వీడియోలు వైరల్‌గా మారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Nidhhi Agerwal | హీరోయిన్ నిధీ అగర్వాల్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంపై రచ్చ..?

Nidhhi Agerwal | అమరావతి : హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల ఏపీ ప్రభుత్వ వాహనాల్లో చక్కర్లు కొట్టిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాతో పాటు ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి ఆగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల విజ‌య‌వాడ‌కి వెళ్లిన సందర్భంలో ప్రభుత్వ వాహనం వినియోగించినట్లుగా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే హీరోయిన్ కు ప్రభుత్వ వాహనం ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు వివాదంగా మారింది. ఏ నిబంధనలు..ప్రోటోకాల్ మేరకు ఆమెకు ప్రభుత్వ వాహనం సమకూర్చారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత పనులకు ఎలా వాడుతారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనంటు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించిన ఈ వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన నటికి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుండి లేదా నిధి అగర్వాల్ నుంచి ఇప్పటికైతే ఎటువంటి స్పందన వెలువడలేదు.