NTR|వామ్మో ఎన్టీఆర్‌కి అంత కోప‌మేంటి.. తొలిసారి క‌ట్ట‌లు తెంచుకుందిగా..!

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు తెలుగులో దేవ‌ర అనే సినిమా చేస్తూనే హిందీలో వార్ 2 చిత్రం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రెండు మూవీల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్‌కి చాలా ఓపిక ఎక్కువ. ఎవ‌రు ఎంత

  • By: sn    cinema    Apr 26, 2024 10:53 AM IST
NTR|వామ్మో ఎన్టీఆర్‌కి అంత కోప‌మేంటి.. తొలిసారి క‌ట్ట‌లు తెంచుకుందిగా..!

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు తెలుగులో దేవ‌ర అనే సినిమా చేస్తూనే హిందీలో వార్ 2 చిత్రం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రెండు మూవీల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్‌కి చాలా ఓపిక ఎక్కువ. ఎవ‌రు ఎంత విసిగించిన కూడా పెద్ద‌గా కోపం తెచ్చుకోడు. న‌లుగురికి మంచి చెబుతాడే త‌ప్ప కోపోద్రిక్తుడు కావ‌డం చాలా త‌క్కువ‌గా చూశాం. అయితే ఆయ‌న ముంబైలో గొంతు పెద్దది చేసి సీరియస్ అయ్యారు. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆయ‌న కోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ హోట‌ల్ రూమ్‌కి వెళుతుంటే ఫొటోగ్రాఫ‌ర్స్ వెన‌క ప‌డి మ‌రీ ఫొటో తీస్తుండ‌డంపై జూనియ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తుండడంతో ఓయ్ అంటూ ఫొటోగ్రాఫ‌ర్స్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఇందులో పెద్ద విషయ‌మే లేక‌పోయిన నార్త్ మీడియా బ్యాచ్ మాత్రం కావాల‌ని జూనియ‌ర్‌పై తీవ్ర‌మైన నెగెటివ్ ప్ర‌చారం చేస్తుంది. కాని వాళ్ల‌కి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ ఎంత స‌రదాగా ఉంటారు, మీడియాతో ఎంత కోప‌రేటివ్‌గా ఉంటారనేది. వార్2 లుక్‌ని సీక్రెట్‌గా ఉంచేందుకు ఎన్టీఆర్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా కూడా ఫొటోగ్రాఫ‌ర్స్ ప‌ర్మీష‌న్ లేకుండా ఫొటోలు తీయ‌డంతో జూనియ‌ర్‌కి కోపం న‌షానికి ఎక్కిన‌ట్టు తెలుస్తుంది. ఇక వార్ 2 మూవీలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వార్ 2 చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఎన్టీఆర్ పార్ట్ మొదలు కానుంద‌ని తెలుస్తుంది. ఇది పూర్త‌య్యాక తిరిగి దేవ‌ర షూట్ మొద‌లు పెట్ట‌నున్నారు.. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో దేవర నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. రెండు పార్ట్‌లుగా ఈ మూవీ రూపొందుతుంది. తొలి పార్ట్‌ని అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.