OG Movie : ‘ఓజీ’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ !
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కణ్మని పాత్రలో అలరించనున్న ఆమెపై ఫ్యాన్స్‌లో క్రేజ్ పెరిగింది.

OG Movie | విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగస్టర్ డ్రామా ‘ఓజీ’(OG) నుంచి మేకర్స్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan) పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాంగా ప్రియాంక మోహన్ పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. ఇందులో కణ్మని పాత్రలో ప్రియాంక అలరించనుంది. ప్రియాంక ఫస్ట్ లుక్ చూస్తుంటే ఓజీ మూవీ ఫ్లాష్‌బ్యాక్ సంబంధించిన సన్నివేశాల్లో ఆమె పాత్రదై ఉంటుందని తెలుస్తోంది. చీరకట్టులోని ప్రియాంక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. డీడీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీడీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెకండ్ సింగిల్ ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.