OG Review : పవన్ కల్యాణ్.. ఓజీ ట్విట్టర్ రివ్యూ! ఎలా ఉందంటే
OG Review | ఓజీ ప్రిమియర్ షోలు చూసిన పవన్ అభిమానులు ఎట్టకేలకు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా లేని పవర్ స్టార్ కు ఈ సినిమాతో భారీ హిట్ దక్కినట్లేనంటూ ఓ రేంజ్‌లో సంబుర పడుతున్నారు. సినిమా కథలోకి వెళితే...

విధాత: సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందిన ఓజీ (OG) సినిమా ప్రీమియర్ షోలతో సినిమా రివ్యూస్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. గ్యాంగ్ స్టర్ గ్యాంగ్ వార్ యాక్షన్ కథతో రూపొందిన ఓజీ ప్రిమియర్ షోలు చూసిన పవన్ అభిమానులు ఎట్టకేలకు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా లేని పవర్ స్టార్ కు ఈ సినిమాతో భారీ హిట్ దక్కినట్లేనంటూ ఓ రేంజ్‌లో సంబుర పడుతున్నారు. సినిమా కథలోకి వెళితే హీరో పవన్ కల్యాణ్ (గ్యాంగ్ స్టర్ ఓజస్ గంభీర) జపాన్ నుంచి వస్తుండగా షిప్‌లో దాదా(ప్రకాష్ రాజ్)పై జరిగిన దాడిని అడ్డుకుంటాడు. దాంతో దాదా గంభీరాను తన రైట్ హ్యాండ్‌గా మార్చుకుని ముంబైలో సెటిల్ అవుతాడు.
సడన్‌గా ఓ రోజు నుంచి గంభీర కనపడకుండా పోవడం, ఆ తర్వాత వెంటనే విలన్ గ్యాంగ్ రావడం, ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగిపోతాయి. ఈ క్రమంలో గంభీర ఎటు వెళ్లి పోయాడు, తిరిగి వచ్చాడా లేదా గంభీర అదృశ్యానికికారణమేంటి అనేక పాయింట్‌తో సినిమా సాగుతూ ఆద్యంతం ఫ్యాన్స్ తో ఈలలు వేయించేలా ఉందంటున్నారు. ఫైటింగ్ సీన్లలో పవన్ తన పాత సినిమాల్లో వాడినా కటనా (సమురాయ్ కత్తి), నాన్‌చాక్, గన్ స్వాగ్ ల యాక్షన్ సీన్ లను మరోసారి గుర్తుకు తెచ్చి అభిమానులలో కొత్త జోష్ నింపారు.
గతంలో కమలాహాసన్ నాయకన్ తరహా కథనే అయినా స్టోరీ నడిపించిన విధానం అదిరిపోయిందని, చాలా సందర్భాల్లో పవన్‌న ఉ ఎలివేట్ చేసిన విధానం నెవర్ భిఫోర్ అనే రేంజ్‌లో ఉందని, అంతేగాక ప్రధాన పాత్రలకు ఇచ్చిన హైప్ కూడా అదే రేంజ్‌లో ఉందని చెబుతున్నారు. ఇక తమన్ ప్రాణం పెట్టాడని మొత్తంగా చెప్పాంటే దాదాపు దశౄబ్దం విరిమం తర్వాత పవన్కు సాలీడ్ హఙట్ పడిందని, ఇక థియేటర్లు దద్దరిల్లుతాయని, బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని అంటున్నారు. తక్కువలో తక్కువ రూ. 500 కోట్లకు మించి వసూళ్లు ఖాయమని పోస్టులు పెడుతున్నారు. రెండు నెలల క్రితం వీరమల్లుతో నిరాశ పర్చిన దాని తాలుకా ఎంజాయ్ఈ సినిమా ఇస్తుందని, ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమని పదే పదే చెబుతున్నారు.