Hanamkonda : కోళ్ళు…కోళ్ళూ ఊరంతా కొక్కురోకో
ఎల్కతుర్తి పత్తి చేనులో వదిలిన 2,000 వేల కోళ్ల కోసం ఊరంతా పరుగులు.. ఒక్కొక్కరికి దొరికిన కోడి పండగలా జరుపుకున్న ప్రజలు.
విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పత్తి చేనులో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన నాటుకోళ్లను పట్టుకునేందుకు ఊరు ప్రజలంతా ఎగబడ్డారు. దీంతో ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఒకటి రెండు కోళ్లు దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎవరి చేతిలో చూసిన కొక్కరోకో అంటూ చూస్తున్న కోళ్లు దర్శనమిచ్చాయి. ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎల్కతుర్తి సమీపంలోని పత్తి చేనులో సుమారు రెండు వేల కోళ్లను వదిలేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఊరు ప్రజలు కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీసి దొరికిన కోడిని దొరికినట్లు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు కోళ్లను బస్తాలలో వేసుకొని పోగా మరికొందరు ఒకటి రెండు దక్కించుకున్నారు. ఈ పరుగు పందెంలో కోళ్లు దక్కని వాళ్ళు నిరాశ వ్యక్తం చేశారు. దొరికిన కోళ్లను పెంచుకునేందుకు ప్రయత్నించకుండా వాటిని విందు భోజనంలో వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఊరంతా కోడికూర వాసనతో గుమగుమలాడింది. అసలు ఈ కోళ్లను ఎక్కడినుంచి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు. ఎందుకు ఇక్కడ విడిచి పెట్టారనేది మిస్టరీగా మారింది.
పొలాల్లో నాటుకోళ్లు వదిలి వెళ్ళిన దుండగులు.. ఎగబడ్డ జనం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి – సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 కోళ్లను వదిలి వెళ్ళిన దుండగులు
కోళ్ల కోసం పొలాల్లో ఎగబడి, పరుగులు తీసిన జనం
ఈరోజు ఊరంతా నాటుకోడి పులుసే అంటూ చిందులు pic.twitter.com/UU4sdPKs2o
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram