Chicken Price | కొండెక్కిన కోడి కూర ధర.. ఆందోళనలో నాన్ వెజ్ లవర్స్..!
Chicken Price | ఆదివారం వచ్చిందంటే చాలు.. అందరి మనసు నాన్ వెజ్( Non Veg ) వైపు లాగుతోంది. అందులోనూ చాలా మంది చికెన్( Chicken )ను ఇష్టపడుతుంటారు. కానీ చికెన్ ప్రియులకు( Chicken Lovers ) మాత్రం ఇది కాస్త బాధ కలిగించే విషయమే.
Chicken Price | ఆదివారం వచ్చిందంటే చాలు.. అందరి మనసు నాన్ వెజ్( Non Veg ) వైపు లాగుతోంది. అందులోనూ చాలా మంది చికెన్( Chicken )ను ఇష్టపడుతుంటారు. కానీ చికెన్ ప్రియులకు( Chicken Lovers ) మాత్రం ఇది కాస్త బాధ కలిగించే విషయమే. ఎందుకంటే కోడి కూర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కోడి గుడ్డు( Egg ) ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 300 వరకు పలుకుతోంది. పది రోజుల క్రితం కిలో స్కిన్ చికెన్ రూ. 240 ఉండగా, స్కిన్ లెస్ ధర రూ. 260 వరకు విక్రయించారు. శనివారం వరకు ఈ ధర రూ. 280 వరకు కొనసాగింది. ఇవాళ ఆదివారం కావడంతో ఆ ధరలు కాస్త పెరిగి రూ. 300కు చేరుకున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ఈ ధరలు మరింత పెరిగి.. మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది.
ఇక కోడి గుడ్ల ధర విషయానికి వస్తే.. అవి కూడా భారీగానే పెరిగిపోయాయి. రెండు నెలల క్రితం ఒక్కో గుడ్డు ధర రూ. 6 ఉండగా, ఆ ధర క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. మొన్నటి వరకు రూ. 6.50 పలికిన గుడ్డు ధర ఇప్పుడు మార్కెట్‌లో అమాంతం పెరిగి రూ. 7.50కు చేరుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో రూ. 8కి తగ్గకుండా విక్రయించే అవకాశం ఉంది. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
చికెన్ ధరల పెరుగుదలకు కారణాలు ఇవే..
చికెన్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం చలి తీవ్రతనే అని కోళ్లఫారాల యజమానులు పేర్కొంటున్నారు. చలి తీవ్రత కారణంగా కోళ్లు పలు వ్యాధులకు గురై చనిపోతున్నట్లు తెలిపారు. దీనివల్ల ఉత్పత్తి తగ్గిపోయి మార్కెట్‌లో కోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని వివరించారు. కొద్దిరోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణం మరింత చల్లబడింది. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం కారణంగా కొరత ఏర్పడి ధర పెరిగిందని చెబుతున్నారు. పైగా కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు కూడా పెరిగినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram