Chikiri..from Peddi | రేపే రామ్‌చరణ్‌ ‘పెద్ది’ నుంచి ‘చికిరి’.. : ఏఆర్‌ రెహమాన్‌ మెలోడీ సెన్సేషన్​

రామ్‌చరణ్‌ ‘పెద్ది’ నుంచి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌తో వచ్చిన తొలి సింగిల్‌ ‘చికిరి’ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌. చరణ్‌ బీడీ స్టెప్‌, రెహమాన్‌ మెలోడీ కలయిక అభిమానుల్లో ఫుల్​ జోష్​ నింపింది. రేపు నవంబర్‌ 7న పూర్తి పాట రిలీజ్‌, 8న రెహమాన్​ లైవ్‌ కాన్సర్ట్‌‌లో ఇదే ప్రత్యేక ఆకర్షణ.

  • By: ADHARVA |    cinema |    Published on : Nov 06, 2025 10:42 PM IST
Chikiri..from Peddi | రేపే రామ్‌చరణ్‌ ‘పెద్ది’ నుంచి ‘చికిరి’.. : ఏఆర్‌ రెహమాన్‌ మెలోడీ సెన్సేషన్​

Ram Charan’s “Chikiri” Song from Peddi: AR Rahman’s Magical Melody Creates a Storm!

‘ఉప్పెన’తో సెన్సేషన్‌ సృష్టించిన బుచ్చిబాబు సనా, ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలసి ఒక తన కలకాలపు కలను తెరపైకి తీసుకొస్తున్నాడు — అదే పెద్ది. ఈ చిత్రానికి లెజెండరీ కంపోజర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండటంతో, సినిమా మీద ఉన్న హైప్‌ మరో స్థాయికి చేరింది. తాజాగా, ‘పెద్ది’ నుంచి తొలి సింగిల్‌ చికిరి ప్రోమోను విడుదల చేయగానే సోషల్‌ మీడియా దద్దరిల్లింది.

చికిరిఅంటే సహజమైన సొగసుకు ముద్దుపేరు

‘చికిరి’ అనే పదం సాధారణంగా వినిపించే పదం కాదు. కానీ బుచ్చిబాబు సనా చెబుతున్న అర్థం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అవసరంలేని ముక్కు, అలంకరణతో పనిలేని సహజమైన సొగసుతో ఉండే అమ్మాయిని పెద్ది గాడి ఊళ్లో పిలిచే మాటే చికిరి అని దర్శకుడు తెలిపారు. అదే పదంతో రామ్‌చరణ్‌ మైమరపు ప్రేమ గీతంగా ఏఆర్‌ రెహమాన్‌ మెలోడీలో మలిచారు. మోహిత్‌ చౌహాన్‌ గాత్రంలో వచ్చిన “చికిరి చికిరి…” బిట్​  ఇప్పటికే అభిమానుల మదిలోకి దూసుకుపోతోంది. ఆ పాటలో చరణ్​ వేసిన హుక్​స్టెప్​ మెగాస్టార్​ను గుర్తుకుతెస్తోందని మెగా అభిమానులు మురిసిపోతున్నారు.
పాట గురించి బుచ్చిబాబు–రెహమాన్‌ చర్చించుకుంటూ చేసిన వీడియోలో, దర్శకుడు స్కూల్‌ రోజుల్లోనే రెహమాన్‌ మ్యూజిక్‌ పట్ల తనకు ఉన్న మమకారాన్ని చెప్పాడు. ‘బొంబాయి’ స్టైల్‌ ఎనర్జీతో, ‘హమ్మా హమ్మా’ వంటి వైబ్‌తో ఈ పాట ఉండాలి” అని చెప్పగానే రెహమాన్‌ ఇచ్చిన ట్యూన్‌ నేరుగా ఆమోదం పొందింది.

Director Buchi Babu Sana reveals to AR Rahman that the Chikiri song in Peddi needed “Bombay-style energy and a Hamma Hamma vibe,” and Rahman instantly composed the perfect tune.

చరణ్‌ చికిరి.. బీడీ స్టెప్‌తో ఇంటర్నెట్‌ షేక్​

23 సెకన్ల చికిరి ప్రోమోలో చరణ్‌ సింపుల్‌ వైట్‌ షర్ట్‌, గ్రే ట్రౌజర్స్‌లో, కొండ ఎగువన బీడీ తాగుతూ డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఆ స్టెప్‌ ఒక్కటే అభిమానుల్లో ఎలక్ట్రిక్‌ ఎనర్జీని సృష్టించింది. “చరణ్‌ అన్న ఆ స్టెప్‌ చంపేశాడు!”, “ఇది ‘ముఠా మేస్త్రీ’లోని ‘ఈ పేటకు నేనే మేస్తిరీ..’ పాటలో వేసే సెన్సేషనల్ స్టెప్​కు సమానమైన మాస్‌ మూమెంట్‌” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఆ హుక్‌స్టెప్‌ను చిరంజీవి లెజెండరీ మూవ్‌లతో పోలుస్తూ ఫైర్‌ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు.

జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఇప్పటికే ఈ స్టెప్‌ రీల్స్‌, షార్ట్స్‌లతో వైరల్‌ అవుతోంది. అభిమానులు దీనిని “డాన్స్‌ ఫ్లోర్స్‌ను షేక్​ చేసే మంత్ర”గా పేర్కొంటున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ మెలోడీ–మాస్‌ మిక్స్‌ సాంగ్‌ రేపు అంటే నవంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. మరుసటి రోజు, నవంబర్‌ 8న హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో రెహమాన్‌ లైవ్​ కాన్సర్ట్​లో స్వయంగా ‘చికిరి..’ని లైవ్‌గా పాడబోతున్నాడు.

పెద్ది టీమ్‌లో స్టార్‌ బృందం

వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్​ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేంద్రు శర్మ, చమ్మక్‌ చంద్ర, సత్య వంటి ప్రతిభావంతులైన నటులు భాగమయ్యారు. శ్రీలంక షెడ్యూల్‌ పూర్తిచేసిన టీమ్‌ త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది.
మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం, చరణ్‌ కెరీర్‌లో అత్యంత విశిష్టమైన మ్యూజికల్‌–మాస్‌ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్నారు.