Pedhdi Movie| అదిరిన ‘పెద్ది’ ‘చికిరి చికిరి’ సాంగ్ వీడియో షాట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి తొలి పాటగా ‘చికిరి చికిరి’ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ వద్దకు వెళ్లి దర్శకుడు బుచ్చిబాబు కలిసి మాట్లాడే వీడియోతో చికిరి అనే పల్లవితో పాటను పరిచయం చేశారు

Pedhdi Movie| అదిరిన ‘పెద్ది’ ‘చికిరి చికిరి’ సాంగ్ వీడియో షాట్

విధాత: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)హీరోగా బుచ్చిబాబు(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా(Pedhdi Movie) నుంచి తొలి పాటగా ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri Song)మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్(AR Rahman)  వద్దకు వెళ్లి దర్శకుడు బుచ్చిబాబు కలిసి మాట్లాడే వీడియోతో చికిరి అనే పల్లవితో పాటను పరిచయం చేశారు. పెద్ది సినిమా ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ భారీ షాట్ కొట్టడం..దానికి మీరు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా క్లిక్ అయ్యిందని గుర్తు చేస్తాడు. ఈ సారి చికిరి పాటతో సెకండ్ షాట్ కొట్టాలని నిర్ణయించుకున్నానని..చికిరి పేరుతో పాట బీట్ ను అందించాలని దర్శకుడు బుచ్చిబాబు సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ ను కోరుతాడు.

దీనికి చికిరి అంటే అర్ధం ఏమిటంటూ రెహమాన్ ప్రశ్నిస్తాడు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా చికిరి అని పిలుస్తారని దర్శకుడు వివరిస్తూ ప్రోమో పంచుకున్నారు. దీంతో చికిరి అంటే ఏమిటన్న ఆడియన్స్ ఆసక్తికి దర్శకుడు సమాధానమిచ్చినట్లయ్యింది. బుచ్చిబాబు చెప్పిన ‘చికిరి చికిరి’ పల్లవి బాగుందంటూ దానితోనే పాట ప్రారంభిద్దామన్న రెహమాన్ అదిరిపోయే బీట్ తో చికిరి సాంగ్ పల్లవిని విడుదల చేశారు. చికిరి పూర్తి పాటను ఈనెల 7వ తేదీన విడుదల చేస్తారు.

ఇదంతా ఒక ఎత్తయితే..ఈ పాట బీట్ కు హీరో రామ్ చరణ్ వేసిన స్టెప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ స్టెప్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘చికిరి చికిరి’సాంగ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసిందంటున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ గా అచ్చాయమ్మ పాత్రలో నటిస్తుంది. స్పోర్ట్స్, విలేజ్ పోలిటిక్స్ నేపథ్యంలో పెద్ది సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తుంది.