UP train accidentయూపీలో రైలు ప్రమాదం..నలుగురు మృతి
ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్(up) లోని మిర్జాపూర్ చునార్ రైల్వే స్టేషన్ (Chunar railway station)లో జరిగిన రైలు ప్రమాదం(train accident)లో నలుగురు ప్రయాణికులు దుర్మరం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తున్న భక్తులుగా గుర్తించారు. మరోవైపు ఫ్లాట్ ఫామ్ పై ఉన్న రైలును అందుకునే తొందరలో వారంతా రైలు రాకను గమనించకుండా పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు.
నిన్ననే చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ లో ట్రాక్ పై ఆగిఉన్న గూడ్స్ రైలును ఫ్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనలో 11మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 14మంది గాయపడ్డారు. మృతులకు రైల్వే శాఖ రూ.10లక్షల ఆర్థిక సహాయం, గాయపడిన వారికి రూ.5లక్షలు సహాయం ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య సదుపాయాలు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. చత్తీస్ ఘడ్ రైలు దుర్ఘటన ప్రమాదకరంగా జరిగిపోగా…యూపీ చునార్ రైల్వే స్టేషన్ ఘటన ప్రయాణికుల నిర్లక్ష్యంతో జరుగడం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram