Bihar Elections | బీహార్ ఎన్నికల్లో సంపన్న అభ్యర్థులు.. లిస్ట్ ఇదే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలన్నా.. ఎన్నికలలో పోటీ చేయాలన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది.
విధాత :
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలన్నా.. ఎన్నికలలో పోటీ చేయాలన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రచార సమయంలో అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా, కోటీశ్వరులను బరిలోకి దింపితే తమకు అనుకూలంగా ఉంటుందనే భావన చాలా పార్టీల్లోనే ఉంటాయి. ఎందుకంటే అభ్యర్థిని నిలబెట్టడం ఒక ఎత్తయితే, వారు ప్రచారం చేయడం మరోఎత్తు. జెండాలు, పాంప్లెంట్లు, పోస్టర్లు, వాహనాలు, భోజనాలు ఇలా చెప్పుకుంటుపోతే లిస్ట్ చాలానే ఉంటుంది..డబ్బులు ఖర్చు పెట్టడానికి. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పలు పార్టీలు డబ్బులున్న వారినే ఎన్నికల బరిలోకి దింపడానికి మొగ్గుచూపుతాయనేది అందరికి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సంపన్నులు చాలా మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ నామినేషన్ల సమయంలో తమ ఆస్తి వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. అలాగే, బీహార్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఆస్తుల వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ తన జాబితాలో వివరించింది. వీరిలో వికాస్‌షిల్ ఇన్సాస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రణ్ కౌశల్ ప్రతాప్ సింగ్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన సింగ్ లౌరియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. కాగా, తన మొత్తం ఆస్తులు రూ.368 కోట్లని.. అందులో రూ.27 కోట్లు చరాస్తి.. రూ.341 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
అలాగే, గయా జిల్లా గురువా నుంచి బరిలో ఉన్న రాష్ట్రియ లోక్ జనశక్తి పార్టీ నేత నితీష్ కుమార్ రూ. 250 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.171 కోట్ల ఆస్తితో ముంగేర్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ మూడో సంపన్న అభ్యర్థిగా నిలిచాడు. కాగా, స్వతంత్ర అభ్యర్థుల్లో రాజ్ కిషోర్ గుప్తా రూ.137 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. వీటిలో రూ. 1.48 కోట్ల చరాస్తులు, రూ.136 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జనతాదళ్(యునైటెడ్) అభ్యర్థి అనంత కుమార్ సింగ్ రూ. 100 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇలా దాదాపు పోటీలో ఉన్నవారిలో చాలామంది కోటీశ్వరులే కావడం గమనార్హం. కాగా, బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు గురువారం జరిగింది. రెండో విడత పోలింగ్ ఈ నెల11 న జరగనుండగా 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram