Prabhas| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న విషయం ఇప్పటికే రివీల్ అయిన, ప్రభాస్ పెళ్లికి సంబంధించి మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆయన పెళ్లిపై కొన్నాళ్లుగా ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నా కూడా
Prabhas| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న విషయం ఇప్పటికే రివీల్ అయిన, ప్రభాస్ పెళ్లికి సంబంధించి మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆయన పెళ్లిపై కొన్నాళ్లుగా ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నా కూడా ప్రభాస్ మాత్రం వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆయన కన్నా తక్కువ ఏజ్‌లో ఉన్నవారందరు కూడా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నారు. కానీ, డార్లింగ్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తింది లేదు. అయితే ఆయన ఎలాగు పెళ్లి ఊసు ఎత్తడం లేదని అభిమానులే ఏఐ ద్వారా ప్రభాస్ కు, అనుష్కకు పెళ్లి చేసి.. పిల్లలను కూడా పుట్టించేశారు.
పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నారు. వీటితర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేయనున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2 చేయాల్సి ఉంది. మరికొన్ని సినిమాలు కూడా డిస్కషన్స్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. భారీగానే ఆస్తులు కూడబెడుతున్నాడు. సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు ప్రభాస్. కొన్ని సినిమాలకైతే లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ ఆస్తుల విలువ రోజురోజుకి భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ఖరీదైన ఫాంహౌస్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు ఇలా ఎన్నో ఆస్తులు ప్రభాస్‌కి ఇండియాతో పాటు విదేశాలలో ఉన్నాయి.
ప్రభాస్ వయస్సు ఇప్పుడు 44 ఏళ్లు. ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆస్తులు ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. డార్లింగ్ ప్రభాస్‌కి ప్రభోద్ అనే సోదరుడు, ప్రగతి అనే సోదరి ఉన్నారు. వీరిద్దరు కాకుండా పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోని పక్షంలో ఆయన ఆస్తులన్నీ కూడా వీరికే చెందుతాయని అంటున్నారు. చూడాలి మరి ప్రభాస్ అసలు పెళ్లి చేసుకోకుండా అలా బ్యాచిలర్‌గానే ఉంటాడా, లేదంటే ఏదో ఒక రోజు సైలెంట్‌గా వివాహం చేసుకొని పెద్ద షాక్ ఇస్తాడా.