Prabhas|మరోసారి డ్యూయల్ రోల్‌లో ప్రభాస్.. ఏం చేస్తాడా అని టెన్షన్
Prabhas|డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అంతా ఆయన పేరు వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది. అభిమానులు డార్లింగ్ బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బాణా సంచాలు కాల్చడం, పాలాభిషేకాలు చేయడం, కేక్ కటింగ్ వంటివి చేశారు. ఇక ప్రభాస్‌కి ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు అనేకమంది సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజే

Prabhas|డార్లింగ్ ప్రభాస్(Prabhas) బర్త్ డే సందర్భంగా అంతా ఆయన పేరు వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది. అభిమానులు డార్లింగ్ బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బాణా సంచాలు కాల్చడం, పాలాభిషేకాలు చేయడం, కేక్ కటింగ్ వంటివి చేశారు. ఇక ప్రభాస్‌కి ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు అనేకమంది సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విషెస్ అందరిని ఆకట్టుకుంది. కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరు. ఇక పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా ప్రభాస్‌కి బర్త్ డే విషెస్ తెలియజేశారు.
మరోవైపు ప్రభాస్ సినిమాలకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ కూడా ఇచ్చారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘ది రాజాసాబ్’ (The Rajasaab)నుంచి ఓ క్రేజ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చూసి మురిసిపోయిన ఫ్యాన్స్‌ను తాజాగా వదిలిన మోషన్ పోస్టర్‌తో భయపెట్టాడు డైరెక్టర్ మారుతీ. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి అందరు షాక్‌లో ఉండిపోయారు.మోషన్ పోస్టర్ లో ప్రభాస్ తాత గెటప్ లో ఉన్నాడు. గతంలో ప్రభాస్ ఇందులో తాత గెటప్ లో కనిపిస్తాడని, డ్యూయల్ రోల్ చేస్తారని వార్తలు వచ్చాయి. నేడు మోషన్ పోస్టర్ తో దీనిపై క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్.
మోషన్ పోస్టర్‌లో బీజీఎం అదిరింది. ఏదో హాలీవుడ్ హార్రర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక చెట్ల మధ్యలో ఉన్న ఓ కోట లాంటి ఇల్లు.. అందులో సింహాసనంపై రాజసంగా కూర్చున్న ప్రభాస్ పోస్టర్ అదిరిపోయింది. గతంలో ప్రభాస్ బిల్లా, బాహుబలి సినిమాలలో డ్యూయల్ రోల్ చేసాడు. ఇప్పుడు తిరిగి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అయితే మోషన్ పోస్టర్(Motion Poster) మాత్రం భారీ అంచనాలే పెంచేసింది.ఈ మూవీ హారర్ నేపథ్యంలో రూపొందుతుంది కాబట్టి చిత్రంలో యంగ్ ప్రభాస్ హీరోగా, ముసలి తాతా దెయ్యంగా కనిపించనున్నాడని తెలుస్తుంది.