Prabhas|ప్లీజ్.. మీరు ఎవరు కూడా నా దగ్గరకి రావొద్దంటూ ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్
Prabhas| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రికార్డుల రారాజుగా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం కల్కి సంచలన రికార్డులు నమోదు చేస్తుంది. కల్కి చిత్రం ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరగా, సినిమా రూ.1200 కోట్లు రాబట్టే దిశగా పయనిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో

Prabhas| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రికార్డుల రారాజుగా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం కల్కి సంచలన రికార్డులు నమోదు చేస్తుంది. కల్కి చిత్రం ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరగా, సినిమా రూ.1200 కోట్లు రాబట్టే దిశగా పయనిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రభాస్ అదే ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలని కూడా శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే కల్కి సినిమాలో కల్కి భగవానుడి గురించి గ్రంథాలకు భిన్నంగా, తప్పుగా చూపించారని అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లతో పాటుగా కల్కి యూనిట్‌కు కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్టం లీగల్ నోటీసులు పంపారు. మరి దీనికి చిత్ర బృందం ఎలా స్పందిస్తుందా అని వేచి చూస్తున్నారు.
అయితే మూడు వారాల క్రితం థియేటర్స్‌లో వచ్చినా సరే ఇంకా కల్కి క్రేజ్ పోలేదు. మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే బాహుబలి2తో దేశంలోనే నెంబర్ వన్ హీరోగా మారిన ప్రభాస్.. సలార్, కల్కి చిత్రాలతో మరింత ఎత్తుకి ఎదిగారు. భవిష్యత్‌లో ఆయన స్థానాన్ని అధిరోహించడం ఇతర హీరోలకి కష్టమే అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటన కూడా చేయలేదు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ల దగ్గర నుంచి మీడియం రేంజ్ ఉన్న బ్రాండ్ల కంపెనీలు ప్రభాస్‌ని యాడ్స్‌లో నటింపజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి.
అయితే డార్లింగ్ కు మొదటినుంచి వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఇష్టం ఉండదు. బాహుబలి 2 తర్వాతి నుండి ప్రభాస్‌ని ప్రతి సినిమా తర్వాత కంపెనీల ప్రతినిధులు కలుస్తూనే ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం వారితో దయచేసి తనదగ్గరకు మరోసారి రావొద్దని, తనకు యాడ్స్ లో నటించడం ఇష్టంలేదని, ఏ బ్రాండ్లను తాను ప్రమోట్ చేయనని క్లియర్ కట్‌గా చెప్పి పంపించేస్తున్నారట. వందల కోట్లు ఆఫర్ చేస్తున్నా కూడా ప్రభాస్ వారి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, అభిమానులు ప్రభాస్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.