Monalisa: స్పెషల్ సాంగ్ లో మెరిసిన మోనాలిసా..!

Monalisa: ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో వెలుగులోకి వచ్చిన పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. మత్తెక్కించే నీలికళ్ల సుందరిగా మోనాలిసా పేరుతో పాపులర్ అయినా పూసలమ్మి ఆ తర్వాతా సినిమాలు, యాడ్స్ తో బిజీగా మారిపోయింది. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా నటన, డ్యాన్స్ లో నైపుణ్యం సంపాదించిన మోనాలిసా క్రమంగా వెండితెరపై రాణించేందుకు కష్టపడుతోంది. తాజాగా ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి నటిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సాంగ్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ హిట్టయితే మోనాలిసా తన అందం..అభినయంతో వెండితెర హీరోయిన్లకు కొత్త పోటీదారు కానుందంటున్నారు అభిమానులు.
View this post on Instagram