Prabhas | వయనాడ్ బాధితులకు అండగా నిలిచిన ప్రభాస్.. సీఎంఆర్‌ఎఫ్ రూ.2కోట్ల విరాళం ప్రకటించిన కల్కీ స్టార్
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నాడు. కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తులో పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు బాధితుల సహాయర్థం సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నాడు. కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తులో పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు బాధితుల సహాయర్థం సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా ప్రభాస్ రూ.2కోట్లను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడున్న ప్రభాస్.. తన స్థాయికి తగ్గట్లుగా విరాళం ప్రకటించారని అభిమాలు ప్రశంసిస్తున్నారు. ప్రభాస్ కరోనా సహా పలు సందర్భలాల్లో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా వయనాడు బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇప్పటికే తమిళ హీరోలు సూర్య, కార్తి, నయనతార, మలయాళ స్టార్ మోహన్‌లాల్, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఇటీవల పాన్ ఇండియా మూవీ కల్కిలో కనిపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1150 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతున్నది. దేశంలో నాల్కో అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కన్నప్పలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇంకోవైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ సైతం శరవేగంగా జరుపుకుంటున్నది. మరో వైపు సందీప్ వంగాతో స్పిరిట్, హను రాఘవపూడి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ యుద్ధ నేపథ్యంలో ‘ఫౌజీ’ మూవీలోనూ కనిపించనున్నాడు.