CMRF: ఖమ్మం, మిర్యాలగూడ ఆసుపత్రుల్లో CMRF నిధుల కుంభకోణం.. నలుగురు అరెస్ట్

విధాత: తెలంగాణలోని ఖమ్మం, మిర్యాలగూడ ఆసుపత్రిలో సీఎంఆర్ఎఫ్ (CMRF) సహాయ నిధులను నకిలీ వైద్య చికిత్స బిల్లులతో కాజేసిన కుంభకోణాన్ని పోలీసులు గుర్తించి నలుగురిపై కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ మల్టీస్పెషల్టీ ఆసుపత్రిలో సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్‌కు చెందిన బి. జ్యోతి, బి. లక్ష్మి, మంగళ దుబ్బ తండాకు చెందిన దీరావత్ నరేష్ లు వైద్యం చేసుకున్నట్లుగా, అందుకు ఆర్థిక సహాయం కోరుతూ సీఎం సహాయ నిధికి నకిలీ బిల్లులు సృష్టించి […]

  • By: Somu    latest    Apr 07, 2023 10:56 AM IST
CMRF: ఖమ్మం, మిర్యాలగూడ ఆసుపత్రుల్లో CMRF నిధుల కుంభకోణం.. నలుగురు అరెస్ట్

విధాత: తెలంగాణలోని ఖమ్మం, మిర్యాలగూడ ఆసుపత్రిలో సీఎంఆర్ఎఫ్ (CMRF) సహాయ నిధులను నకిలీ వైద్య చికిత్స బిల్లులతో కాజేసిన కుంభకోణాన్ని పోలీసులు గుర్తించి నలుగురిపై కేసు నమోదు చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ మల్టీస్పెషల్టీ ఆసుపత్రిలో సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్‌కు చెందిన బి. జ్యోతి, బి. లక్ష్మి, మంగళ దుబ్బ తండాకు చెందిన దీరావత్ నరేష్ లు వైద్యం చేసుకున్నట్లుగా, అందుకు ఆర్థిక సహాయం కోరుతూ సీఎం సహాయ నిధికి నకిలీ బిల్లులు సృష్టించి దరఖాస్తు చేశారు. సదరు బిల్లుల మేరకు ఒక్కొక్కరికి ఒక లక్ష యాభై వేలు చొప్పున ముగ్గురికి 4లక్షల 50 వేలు విడుదలయ్యాయి.

ఖమ్మంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రి నుండి కూడా మరొకరు సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లులతో నిధులు స్వాహా చేసినట్లుగా తేలింది. సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లులపై అనుమానాలు వచ్చిన అధికారులు విచారణ మొదలుపెట్టగా అవి నకిలీ బిల్లులుగా నిర్ధారణ చేశారు.

కుంభకోణానికి పాల్పడిన నలుగురు వ్యక్తుల పైన, ఆసుపత్రి నిర్వాహకుల పైన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల స్వాహా కోసమే తరచూ వారి ఆసుపత్రుల పేర్లు మార్చుకున్నారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.