వైరల్ కాంబినేషన్..దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ తో సుకుమార్ మూవీ!
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుంది. దిల్ రాజు ఎస్వీసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించబడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

విధాత : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు ఊహించని రీతిలో నటి నటులు..దర్శకులు కాంబినేషన్లతో సినిమాలు రూపుదిద్దుకుంటుంటాయి. అలాంటి అనూహ్యమైన కాంబినేషన్ ఒకటి అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. అది కూడా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. సుకుమార్ దర్శకుడిగా…దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రారంభం కానుండటం ఇపుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం ప్రచారంలో ఉన్న ప్రభాస్, సుక్కు కాంబినేషన్ ఇప్పుడు పట్టాలెక్కబోతుంది.
2027 లో రాబోతున్న అల్లు అర్జున్ పుష్ప 3 విడుదలకు ముందుగా..దర్శకుడు సుకుమార్ రాబోయే చిత్రంలో ప్రభాస్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ ఇటీవల రెండు వారాల క్రితం ప్రభాస్‌కు కథాంశాన్ని వివరించగా..సినిమాకు ఆయన ఓకే చెప్పాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు ఎస్వీసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడుతుండటం ఆసక్తికరం. సినిమా కథ ఏమిటీ…హీరోయిన్ సహా ఇతర తారగణం ఎవరన్నది త్వరలోనే తేలనుంది.