DCC President Appointments | 11నుంచి డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పటిష్టతలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది.

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టతలో భాగంగా జిల్లా పార్టీ కార్యవర్గాల నియమకానికి సన్నద్దమవుతుంది. డీసీసీ నియామకాల ప్రక్రియను ఈనెల 11నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఏఐసీసీ పరిశీలకులు అదే రోజు హైదరాబాద్ కు చేరుకుంటారు. డీసీసీ నియమక ప్రక్రియ కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది. వారు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారం రోజులలో ఒక సమగ్రమైన నివేదిక ఏఐసీసీకి అందజేస్తారు.
ప్రతి జిల్లాకు, డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు సమర్పిస్తారని ఇప్పటికే పీసీసీ చీఫ్ బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.