Minister Sitakka | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి : మంత్రి సీతక్క

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, కార్యకర్తలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 28, 2025, 8:28 pm IST
Read Time: 3 mins
Minister Sitakka | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి : మంత్రి సీతక్క

విధాత, వరంగల్ ప్రతినిధి :

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, కార్యకర్తలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికల గెలుపు కానుకగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను గడప, గడపకు ప్రచారం చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి అభివృద్ధి పనిని వివరించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, RTA డైరెక్టర్ వసంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Alsi Read –
Silent Volcanoes | ఎప్పుడైనా బద్దలయ్యేందుకు సిద్ధంగా మరిన్ని అగ్నిపర్వతాలు!
Kokapet Lands | బంగారు భూములు.. కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు
MLC Kavitha | కుట్రలో భాగంగా నన్ను కుటుంబం నుంచి దూరం చేశారు : కవిత