Priyanka Singh| ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా వారి వారి అభిమానులకి చాలా దగ్గరగా ఉంటున్నారు. అడపాదడపా వారితో ముచ్చటిస్తూ సంతో
Priyanka Singh| ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా వారి వారి అభిమానులకి చాలా దగ్గరగా ఉంటున్నారు. అడపాదడపా వారితో ముచ్చటిస్తూ సంతోషపరుస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారికి విచిత్ర పరిస్థితులు కూడా ఎదురవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.అడగరాని ప్రశ్నలు అడిగి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంకని ఓ నెటిజన్ దారుణమైన ప్రశ్న అడిగాడు. దాంతో ఆమె ఇచ్చిన సమాధానానికి వాడి మైండ్ బ్లాక్ అయింది. ఇక మేటర్లోకి వెళితే జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన సాయి తేజ ఆ తర్వాత జెండర్ మార్చుకున్న విషయం తెలిసిందే. ముందు జబర్ధస్త్‌లో లేడి గెటప్స్ వేసి ఆ తర్వాత ఏకంగా జెండర్ మార్చేసుకున్నాడు.
సాయి తేజ కాస్తా ప్రియాంక సింగ్ అయ్యింది. అయితే ఇలా మారడానికి తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, ఎన్ని కష్టాలు ఎదుర్కొంది పలు సందర్భాలలో తెలియజేసింది. అయితే ప్రియాంకకి బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ దక్కగా, ఆ షోటో ఏకంగా 13 వారాలు ఉంది. తన ఆటతో మాటలతో ఎంతో మంది మనసులు దోచుకుంది. అయితే ప్రియాంక ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ అమ్మాయిని మించిన అందంద ఉంటుంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు ప్రియాంక.. మానస్‌పై మనసు పడింది. ఆయనకి ఎన్నో సపర్యయలు చేసింది. కొన్నిసార్లు ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చిన కూడా ప్రియాంక మాత్రం అతనిపై ఇష్టాన్ని చంపుకోలేదు.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రియాంక అతని కోసం క్యాంపైన్ చేసింది. మోత్తానికి బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ అందుకున్న ప్రియాంక ఇప్పుడు పలు షోలలో సందడి చేస్తుంది.. ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వాటిలో తరచు గ్లామరస్ ఫొటో షేర్ చేస్తూ కుర్రాళ్లకి కిక్ ఇస్తుంటుంది. అయితే రీసెంట్గా నెటిజన్స్‌తో ముచ్చటించగా, ఓ నెటిజన్.. ప్రియాంక నాతో డేటింగ్ చేస్తావా? ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా… ప్రియాంక..నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్, మీ నాన్న మీ అమ్మతో ఆ పని చేసినందుకు ఎంత తీసుకుందో అడిగి తెలుసుకుని, అంత నాకు ఇవ్వు… అంటూ ప్రియాంక దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అతడి మైండ్ బ్లాక్ అయింది.