Pushp2| బన్నీ అభిమానులకి షాకిచ్చే న్యూస్.. పుష్ప2 మరోసారి వాయిదా..!
Pushp2| టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప2 చిత్రం ఒకటి. ఈ మూవీని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూడేళ్ల నుండి ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. ఎట్టకేలకి ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫీషియ

Pushp2| టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప2 చిత్రం ఒకటి. ఈ మూవీని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూడేళ్ల నుండి ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. ఎట్టకేలకి ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. కాని ఇప్పుడు మూవీ రిలీజ్‌ని మరి కొన్ని రోజులు వాయిదా వేయబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్లనే వాయిదా వేయనున్నారని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ మూవీ షూటింగ్‌ని జూన్ వరకు పూర్తి చేయాలని గట్టిగా చెప్పాడట. అయితే ఈ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడానికి మరోనెల పడుతుందట.
ఇటీవల కొన్ని సన్నివేశాలు రీషూట్ కూడా చేశారట. వీఎఫ్ఎక్స్ విషయంలో కూడా సుకుమార్ అంత కన్విన్స్ కాకపోవడంతో సినిమా రిలీజ్‌కి మరింత సమయం పట్టే విధంగా ఉంది. చూస్తుంటే పుష్ప2 షూటింగ్ జూలై నెలాఖరు వరకు జరుగుతుందని, ఆ తర్వాత అన్ని పనులు పూర్తి చేయడానికి మరో నెల పైనే సమయం పట్టేలా ఉందని అంటున్నారు. చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫజిల్ కూడా మొన్నటి వరకు తన ఆవేశం మూవీ బిజీలో ఉండడంతో ఈ మూవీకి డేట్స్ కేటాయించలేకపోయాడు. ఇప్పుడు డేట్స్ కేటాయించిన క్రమంలో షూటింగ్ స్పీడ్ పెంచారు. ఇటీవల సినిమా ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.. నవీన్ నూలి ఒక్కడే ఎడిట్ కట్‌లో కష్టపడుతున్నాడు.
నిర్మాతలు సైతం సుకుమార్‌పై ఒత్తిడి పెంచుతున్నారని , బన్నీ సైతం ఆన్ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయాలని అంటుండగా, సుకుమార్ ఎలా ముందుకు వెళతాడా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలిం సిటీలో జరుపుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలన ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అల్లుఅర్జున్‌తో పాటు ఇతర పాత్రధారులపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. చూస్తుంటే సెప్టెంబర్ మొదటి వారం లేదా చివరి వారంలో పుష్ప2 సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.