Pushpa2|పుష్పరాజ్ దిగాడు.. పుష్ప పుష్ప అంటూ తెగ రచ్చ చేస్తున్నాడు
Pushpa2| పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2తో రచ్చ చేసేందుకు దిగుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న పుష్ప2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో

Pushpa2| పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2తో రచ్చ చేసేందుకు దిగుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న పుష్ప2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో వున్న టీజర్‌ను విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1 నిమిషం 8 సెకన్ల పాటు వున్న ఈ టీజర్ మొత్తం బన్నీపైనే సాగగా, ఇది అభిమానులకి మాత్రం మాంచి కిక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇందులో డీఎస్పీ ఇచ్చిన బీజీ మాత్రం దద్ధరిల్లిపోయింది. కేవలం 12 గంటల్లోనే ఈ టీజర్ 51 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.
ఇక కొద్ది సేపటి క్రితం మూవీ నుండి తొలి సాంగ్ విడుదల చేశారు. పుష్పలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ కాగా, పుష్ప2లో ఎలా ఉంటుందో అని ఎప్పటి నుండో అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. వారి అంచనాలని మించి ఈ సాంగ్ ఉంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులని కట్టి పడేస్తుంది. ఈ పాట ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ పాటని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి కొద్ది రోజులలో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత చిత్ర బృందం పలు ప్రాంతాలు తిరుగుతూ మూవీని జనాలలోకి మరింత తీసుకెళ్లనున్నారు.
ఇక పుష్ప 2’లో కూడా అద్భుతమైన భావోద్వేగాలు ఉండేలా సుకుమార్ చిత్ర కథ రాసుకున్నట్టు అర్ధమవుతుంది. ‘పుష్ప’లో తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో పాటు పుష్ప, శ్రీవల్లీల లవ్‌ట్రాక్ హైలైట్ అయితే.. ‘పుష్ప 2’లో ఫ్రెండ్‌షిప్ హైలైట్ కానుందని ఓ టాక్ వినిపిస్తుంది. పుష్ప2లో పుష్పరాజ్, కేశవల స్నేహబంధంపై అద్భుతమైన ఎపిసోడ్స్ చిత్రీకరించినట్టు తెలుస్తుండగా, వారి మధ్య ఉండే సాలిడ్ ఎమోషన్స్ ప్రేక్షకులకి ఎంతగానో కనెక్ట్ అవుతాయని అంటున్నారు. పుష్ప2లో అల్లు అర్జున్ ఆస్కార్ లెవల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. ‘పుష్ప2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
Cheer and celebrate the arrival of PUSHPA RAJ with the #PushpaPushpa chant ❤️🔥#Pushpa2FirstSingle out now 💥
Telugu 🎶 – https://t.co/iTjnKxx2VD
Hindi 🎶 – https://t.co/JNNxEj5i91
Tamil 🎶 – https://t.co/e7XBwbkPXP
Kannada 🎶 – https://t.co/Y8DW2cXVTO
Malayalam 🎶 -… pic.twitter.com/4YPi8l7nfj— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024