Pushpa2| బన్నీ-సుకుమార్ మధ్య గొడవలా.. గడ్డం అడ్డం కాదంటూ వివరణ
Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప విజయంతో ఇప్పుడు రూపొందుతున్న పుష్ప2పై భారీ అంచనాలే ఉన్నాయి. సినీ ప్రియులంతా పుష్ప రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అల్లు అర్జున్, ఫహాద్ ఫజిల్ మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఎప్పుడు చూద్దామా? అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు

Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప విజయంతో ఇప్పుడు రూపొందుతున్న పుష్ప2పై భారీ అంచనాలే ఉన్నాయి. సినీ ప్రియులంతా పుష్ప రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అల్లు అర్జున్, ఫహాద్ ఫజిల్ మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఎప్పుడు చూద్దామా? అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల అంచనాలకి మించి సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీస్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
పుష్ప 2 చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం తెలియజేశారు. కాని సినిమా ఔట్‌పుట్ కాస్త తేడాగా ఉండడంతో మూవీని మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల అవుతుందా లేదా 2025 లోకి వెళుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇప్పుడు పుష్ప2 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు అర్జున్- సుకుమార్ మధ్య గొడవ జరిగిందని, తాను ఎంత బాగా సినిమాను తీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నటులు సరిగా సహకరించకపోవడంతో సుకుమార్ చాలా ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ మాత్రం త్వరగా పూర్తిచేయాలని కోరుతుండటంపై సుకుమార్ అసహనంతో ఉన్నారట.మరోవైపు షూటింగ్ లో పాల్గొనాల్సిన కీలక నటుడికి స్కిన్ ఎలర్జీ రావడంతో వెంటనే సుకుమార్ అమెరికా చెక్కేశారు.
మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ట్రిప్‌కు చెక్కేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప2 మొత్తం బన్నీ గడ్డంతో కనిపించాల్సి ఉండగా, ఇలా సడెన్‌గా ట్రిమ్ చేయడంతో అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గడ్డం ఇప్పుడు అడ్డం కాదని, బన్నీ షూటింగ్‌లో పాల్గొనడానికి చాలా సమయం ఉందని, ఆ లోపు మళ్లీ గుబురు గడ్డంతో రెడీ అయిపోతాడని యూనిట్ నుండి సమాచారం అందుతుంది.