Rajinikanth|ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే ఫ్రేములో.. అభిమానులకి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా..!

Rajinikanth| ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన న‌టుల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్ త‌ప్ప‌న‌సరిగా ఉంటారు. వారిద్ద‌రికి మ‌న‌దేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అమితాబ్ వ‌య‌స్సు 80 ఏళ్లకి పైగా ఉన్నా కూడా ఆయ‌న ఇప్ప‌టికీ సినిమాలు, షోస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఇక ర‌జ‌నీకాంత్ వ‌య‌స్సు ఏడు ప‌దులు దాటింది. అయిన అదే జోష్‌తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి

  • By: sn    cinema    May 04, 2024 7:27 AM IST
Rajinikanth|ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే ఫ్రేములో.. అభిమానులకి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదుగా..!

Rajinikanth| ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన న‌టుల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్ త‌ప్ప‌న‌సరిగా ఉంటారు. వారిద్ద‌రికి మ‌న‌దేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అమితాబ్ వ‌య‌స్సు 80 ఏళ్లకి పైగా ఉన్నా కూడా ఆయ‌న ఇప్ప‌టికీ సినిమాలు, షోస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఇక ర‌జ‌నీకాంత్ వ‌య‌స్సు ఏడు ప‌దులు దాటింది. అయిన అదే జోష్‌తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత మజా అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. జైలర్ సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్న ర‌జ‌నీకాంత్ ఇప్పుడు ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.

భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో ర‌జ‌నీకాంత్‌తో స‌హా అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్.. లాంటి స్టార్ కాస్ట్ న‌టిస్తున్న‌ట్టు గ‌తంలోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ర‌జ‌నీకాంత్ 170వ సినిమా కావ‌డంతో మూవీని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం వెట్టైయాన్ చిత్ర షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ క్ర‌మంలో అమితాబ్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఆ స‌మ‌యంలో వెట్టైయాన్ సెట్స్ నుంచి అమితాబ్, రజిని దిగిన ఫొటోల‌ని లైకా సంస్థ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్స్ లో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.

వెట్టైయాన్ సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ కానుండ‌గా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.ఇక ఇదిలా ఉంటే ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ రూపొంద‌నున్న‌ట్టు కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన సాజిద్‌ నదియావాలా ఈ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాల‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ర‌జ‌నీకాంత్ పాత్ర‌లో ధ‌నుష్ న‌టిస్తాడ‌ని ఓ టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌లసి ఉంది.