Tollywood|ర‌క్షా బంధ‌న్ స్పెష‌ల్.. టాలీవుడ్‌లో సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమాలు ఏంటంటే…!

Tollywood| రాఖీ పండుగ లేదా ర‌క్షా బంధ‌న్ పండుగ‌కి ఎంత ప్రాధాన్య‌త ఉందో ప్ర‌త్యేకంగ చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానులు పంచుకుంటూ రాఖీ పండగను ఎంతో సంతోషంగా ఈ వేడుక‌ని జ‌రుపుకుంటారు. కుల‌మ‌తాలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు కూడా దేశ‌మంతా రాఖీ పండ‌గుని జ‌రుపుకుం

  • By: sn    cinema    Aug 19, 2024 11:43 AM IST
Tollywood|ర‌క్షా బంధ‌న్ స్పెష‌ల్.. టాలీవుడ్‌లో సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమాలు ఏంటంటే…!

Tollywood| రాఖీ పండుగ లేదా ర‌క్షా బంధ‌న్ పండుగ‌కి ఎంత ప్రాధాన్య‌త ఉందో ప్ర‌త్యేకంగ చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానులు పంచుకుంటూ రాఖీ పండగను ఎంతో సంతోషంగా ఈ వేడుక‌ని జ‌రుపుకుంటారు. కుల‌మ‌తాలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు కూడా దేశ‌మంతా రాఖీ పండ‌గుని జ‌రుపుకుంటారు. అయితే అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో చాలా సినిమాలు టాలీవుడ్‌లో రాగా, అందులో కొన్ని చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. సిస్ట‌ర్, బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమాలు ఇప్పుడు యూట్యూబ్‌, ఓటీటీల‌లో అందుబాటులో ఉన్నాయి.

ఒక‌సారి ఆ చిత్రాలు ఏంట‌నేవి చూస్తే.. ముందుగా చిరంజీవి న‌టించిన హిట్ల‌ర్ గుర్తుకు వ‌స్తుంది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన బెస్ట్ మూవీల్లో ఇది ఒక‌టి. ఇందులో ఐదుగురు అమ్మాయిలకు అన్నయ్యగా చిరు నటించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక యాక్షన్ హీరో అర్జున్ న‌టించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి చిత్రం కూడా సిస్ట‌ర్‌ సెంటిమెంట్‌తో తెర‌కెక్కింది. ఈ మూవీలో అర్జున్‌కు చెల్లిగా మధుమిత క‌నిపించింది. ఇందులో అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు మ‌న‌ల్ని చాలా ఎమోష‌న‌ల్‌కి గురి చేస్తాయి. ఇక రాజ‌శేఖ‌ర్‌, ఆర్తి అగర్వాల్ జంట‌గా న‌టించిన గోరింటాకు చిత్రంలో రాజశేఖర్ చెల్లిగా మీరా జాస్మిన్ న‌టించింది. చిన్నతనంలోనే అమ్మానాన్న‌లు చనిపోవడంతో అన్నీ తానైన చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు.

పెళ్ల‌య్యాక కొన్ని అవ‌మ‌నాలు త‌ట్టుకోలేక మీరా జాస్మిన్ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. చెల్లి డెడ్ బాడీ దగ్గర రాజశేఖర్ ఏడ్వడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇక కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించారు. ఇందులో ఏ మ‌హిళ‌కు అన్యాయం జ‌రిగినా అన్న‌లా అండ‌గా నిలుస్తూ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు జూనియ‌ర్. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నగా, తమిళ నటి సంధ్య చెల్లిగా నటించిన చిత్రం ‘అన్నవరం‘. ఇందులో కూడా అన్నాచెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇవే కాకుండా మ‌హేష్ బాబు నటించిన అర్జున్, బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య, సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం, వెంకటేశ్ నటించిన గణేశ్, జగపతి బాబు నటించిన శివరామరాజు, కృష్ణ నటించిన సంప్రదాయ,శోభన్ బాబు నటించిన జీవనరాగం, చెల్లెలి కాపురం, బంగారు గాజులు, పల్నాటి పౌరుషం సినిమాలు కూడా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యాలు సాధించ‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి.