Seethakka| సీఎం, భట్టి, కోమటిరెడ్డిలకు రాఖీ కట్టిన సీతక్క

Seethakka| సీఎం, భట్టి, కోమటిరెడ్డిలకు రాఖీ కట్టిన సీతక్క

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో రాఖీ పౌర్ణమి పండుగ(Raksha Bandhan Celebrations)ను ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దూరదూరాన ఉన్న తమ సోదరుల వద్ధకు వెళ్లి రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Seethakka) రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని, సీం ఎం రేవంత్ రెడ్డికి,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka)లకు వారి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)నివాసానికి వెళ్లి ఆయనకు సీతక్క రాఖీ కట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు కూడా సీతక్క రాఖీ కట్టారు. పొన్నం ప్రభాకర్ తనకు రాఖీ కట్టిన సీతక్క కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender )లకు వారి అక్కా చెల్లెళ్లు..పార్టీ మహిళా విభాగం నాయకురాలులు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.