Raksha Bandhan | అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ.. ఇక్కడ వేడుకలు జరుపుకోరని మీకు తెలుసా..?

Raksha Bandhan | రాఖీ పండుగ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా, రక్షగా ఉండాలనే భావనతో హిందువులంతా రక్షాబంధన్‌ జరుపుకుంటారు. అయితే, కొన్నిచోట్ల మాత్రం రాఖీ పండుగ జరుపుకోరు.

Raksha Bandhan | అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ.. ఇక్కడ వేడుకలు జరుపుకోరని మీకు తెలుసా..?

Raksha Bandhan | రాఖీ పండుగ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా, రక్షగా ఉండాలనే భావనతో హిందువులంతా రక్షాబంధన్‌ జరుపుకుంటారు. అయితే, కొన్నిచోట్ల మాత్రం రాఖీ పండుగ జరుపుకోరు. ఈ పండుగను జరుపుకుంటే అనర్థాలు జరుగుతాయని వారి నమ్మకం. దశాబ్దాలుగా గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. రాఖీ పండుగ జరుపుకోడంపై నిషేధం ఉంటుంది. యూపీలోని జగత్‌పూర్వ, ధౌలానా, సురానా, బైనీపూర్‌ చాక్‌తో పాటు పలు గ్రామాల్లో రాఖీని జరుపుకోరు. వజీరాగంజ్‌ పంచాయతీలో ఉన్న జగత్‌పూర్వలో రాఖీ పండుగను 65ఏళ్లుగా జరుపుకోవడం మానేశారు.

పండుగ జరుపుకుంటే గ్రామంలో విషాదకర ఘటనలు జరుగుతాయని ఇప్పటికీ వారంతా నమ్ముతూనే ఉన్నారు. అయితే, గ్రామంలో 1955లో జరిగిన ఓ సంఘటన చోటు చేసుకున్నది. అది రాఖీ పండుగ రోజునే చోటు చేసుకున్నది. ఓ యువకుడు రాఖీ కట్టుకున్న అనంతరం గ్రామంలో మృతిచెందాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ జరుపుకుంటే కీడు జరుగుతుందని జనాలు నమ్ముతూ వచ్చారు. మరో పదేళ్ల తర్వాత రాఖీ పండుగను జరుపుకునేందుకు గ్రామస్తులు రెడీ అయ్యారు. అదే రోజు సైతం గ్రామంలో విషాదం చోటు చేసుకోవడంతో నేటి వరకు పండుగ జరుపుకోవడం మానేశారు. ఇక మీరట్‌ ప్రాంతంలోని సురానా అనే గ్రామంలో రక్షాబంధన్‌ జరుపుకోరు. దీనికి చారిత్రక కారణాలున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 12వ శతాబ్దంలో రాఖీ రోజున నాటి మహ్మద్‌ ఘోరీ సురానా గ్రామంపై దండయాత్ర చేశాడు.

ఆ గ్రామస్తులందరినీ చంపేశాడని.. ఓ మహిళ, ఇద్దరు మగ పిల్లలు బతికి బయటపడ్డారు. ఆ పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత రాఖీ పండుగ చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ పిల్లలోని ఓ యువకుడు దివ్యాంగుడు అయ్యాడు. దీనికి మహ్మద్‌ ఘోరీ శాపం వెంటాడుతోందని నమ్ముతూ వస్తున్నారు. ఇప్పటికీ జనాలు దాన్నే నమ్ముతూ వస్తున్నారు. దాంతోనే పండుగను జరుపుకోడం నిలిపివేశారు. ఇక సంభాల్‌ జిల్లా బైనీపూర్‌ చాక్‌లో మరో కథనం వ్యాప్తిలో ఉన్నది. అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టాక ఆస్తులు అడగడంతో.. వారంతా గ్రామాన్ని వదిలివెళ్లారు. అలా ఆస్తులు ఇచ్చుకుంటూ పోవడంతో సోదరులంతా డబ్బులేని వారయ్యారు. చివరకు గ్రామంలో రాఖీ పండుగను జరుకోవడాన్ని నిషేధించారు. గున్నార్‌ ప్రాంతం, ధౌలానా గ్రామాల్లోనూ రాఖీపై నిషేధం ఉంటుంది.