భారీ వర్షం మొదలవ్వటంతో రాఖీ కట్టేందుకు అక్క అగచాట్లు!
రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు
అలంపూర్,ఆగస్టు 09: రాఖీ పండుగ పురస్కరించుకుని తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వస్తున్న మహిళలకు భారీ వర్షాల కారణంగా అవస్థలు తప్పడం లేదు.అందులో భాగంగా శనివారం గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడులో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలు దేరి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.దీంతో సమీప పొలాల్లోని వర్షపు నీరు తోతట్టు ప్రాంతమైన గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి భారీగా చేరుకుంది.దీంతో వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చేసేది ఏమి లేక ఆ మహిళ 20 మీటర్ల ఎత్తులో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి గోడ మీద అవస్థలు పడుతూ నడుచుకుంటూ రోడ్డు మార్గంకు చేరుకుంది.ఎన్ని అవస్థలు ఎదురైనా తమ్ముడికి రాఖీ కట్టానన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram