స‌మ్మ‌ర్ వెకేషన్‌లో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌.. బ్యాంకాక్‌లో తెగ చిల్ అవుతున్నారుగా..!

స్టార్ హీరోలు వ‌రుస సినిమాల‌తో తెగ బిజీ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే వారు సినిమాల‌తో ఎంత బిజీగా ఉంటున్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్, మ‌హేష్ బాబు ఫ్యామిలీ విహార యాత్ర‌ల‌కి వెళ్లిన విష‌యం తెల‌సిందే. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది.రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం గేమ్ ఛేంజర్ మూవీగా బిజీగా ఉండ‌గా, ఈ మూవీ షెడ్యూల్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. దాదాపు మే నెల వ‌ర‌కు గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో చిత్రంకి సంబంధించి రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌న 17వ సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాని బుచ్చిబాబు తెర‌కెక్కించ‌నున్నారు.

కొద్ది రోజుల క్రితం ఆర్సీ 17 మూవీ లాంచ్ కాగా,ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక ఈ మూవీని 2024లోనే లాంచ్ చేయ‌నుండ‌గా, ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ పైకి ఎక్కించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ … సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్స్ మొద‌ల‌య్యేలోపు రామ్ చ‌ర‌ణ్ త‌న ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ వేసిన‌ట్టు తెలుస్తుంది. షెడ్యూల్ గ్యాప్‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న కూతురు క్లింకార‌తో క‌లిసి బ్యాంకాక్ వెకేష‌న్ వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీతో పాటు మ‌రో రెండు జంట‌లు కూడా వెకేష‌న్‌కి వెళ్లిన‌ట్టు స‌మాచారం. అయితే వారంద‌రు కూడా బ్యాంకాక్‌లో చిల్ అయ్యేందుకు అక్క‌డికి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

చ‌ర‌ణ్, ఉపాస‌న‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా బ్యాంకాక్ వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. చరణ్ వెకేషన్ కి వెళ్లేముందు ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన సోషల్ మీడియాలో వైర‌ల్ కాగా, ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా బ్యాంకాక్ టూర్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ కాగా, ఇందులో చరణ్, ఉపాసన తో పాటు వీరి ఫ్రెండ్స్ బ్యాంకాక్ లో సముద్రం పక్కన ఉన్న ఓ రిసార్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సాధార‌ణంగా ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న పర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాస‌న షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. రానున్న రోజుల‌లో రామ్ చ‌ర‌ణ్ టూర్‌కి సంబంధించి ఏవైన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తాయో చూడాలి.