NTR| ఎన్టీఆర్ బ‌ర్త్‌డే హంగామా.. ప్రేమ‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

NTR| నందమూరి తార‌క‌రామారావు న‌ట వారసుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వ‌చ్చింది.ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు

  • By: sn    cinema    May 20, 2024 11:50 AM IST
NTR| ఎన్టీఆర్ బ‌ర్త్‌డే హంగామా.. ప్రేమ‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

NTR| నందమూరి తార‌క‌రామారావు న‌ట వారసుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వ‌చ్చింది.ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. కొన్ని ఫ్లాపులు ప‌ల‌క‌రించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాలు మాత్రం జూనియ‌ర్ ఖాతాలో ఉన్నాయి. దేవ‌ర సినిమాతో ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీ హిట్ కొడ‌తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. పలువురు ఎన్టీఆర్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న ఫ్రెండ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ సినిమాలో ఇద్ద‌రు క‌లిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. హ్యాపీయెస్ట్ బ‌ర్త్ డే టూ మై డియ‌రెస్ట్ తార‌క్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో మెగా, నంద‌మూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత కూడా ఈ ఇద్ద‌రు ప‌లు సంద‌ర్భాల‌లో క‌నిపించ‌డం మ‌నం చూశాం.

ఎన్టీఆర్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. 30వ మూవీగా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ నిన్న విడుద‌ల చేశారు మేకర్స్. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఎన్టీఆర్.. ప్రశాంత్‌నీల్‌తో ఓ సినిమా, దేవ‌ర‌2 చిత్రాలు చేయ‌నున్నాడు. వార్ 2 అనే చిత్రంతో బిజీగా ఉన్న జూనియ‌ర్ త్వ‌ర‌లో మ‌రో బాలీవుడ్ చిత్రం కూడా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.. ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్స్ చూసిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా నిలిచాడు.ఎన్టీఆర్ ఆరు సినిమాల్లో ఆరు పాటలు పాడాడు ఇప్పటివరకు. అందులో ఒకటి కన్నడ సాంగ్ కూడా ఉంది.