అల్లు అర్జున్, ప్ర‌భాస్ కాకుండా నార్త్‌లో భారీ క్రేజ్ ద‌క్కించుకున్న స్టార్ హీరో ఎవ‌రంటే..!

  • By: sn    cinema    Apr 07, 2024 5:30 AM IST
అల్లు అర్జున్, ప్ర‌భాస్ కాకుండా నార్త్‌లో భారీ క్రేజ్ ద‌క్కించుకున్న స్టార్ హీరో ఎవ‌రంటే..!

ఒక‌ప్పుడు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన మ‌న హీరోల క్రేజ్ ఇప్పుడు నార్త్‌కి కూడా పాకింది. తెలుగు సినిమాల కోసం అక్క‌డి ప్రేక్ష‌కులు క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఎల్ల‌లు దాట‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన చాలా చిత్రాలు నార్త్‌లో అద‌ర‌గొడుతున్నాయి. పుష్ప చిత్రం బన్నీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మొద‌ట్లో ఈ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత దూసుకుపోయింది. తెలుగు క‌న్నా హిందీలోనే ఈ మూవీ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. పుష్ప విడుదల తర్వాత అల్లు అర్జున్ కి నార్త్ లో ఫేమ్ రాగా, పుష్ప 2 ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప‌2 ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే ప్ర‌భాస్‌కి బాహుబ‌లి సినిమాతో క్రేజ్ రాగా, అల్లు అర్జున్‌కి పుష్ప‌తో వ‌చ్చింది. ఇక రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమ‌తో నార్త్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు రూ. 1100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ దేవర, గేమ్ ఛేంజర్ లపై కూడా నార్త్‌లో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలుగా మంచి ఫేమ్ ద‌క్కించుకోగా, వారంద‌రిని మించి ఒక హీరోకి నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని.

ఈ మ‌ధ్య మంచి విజ‌యాలు రామ్ పోతినేనికి ద‌క్క‌క‌పోయిన కూడా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం తగ్గ‌డం లేదు. రామ్ న‌టించిన సినిమాల‌ని యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తుండ‌గా, వాటికి హిందీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ద‌క్కుతుంది. గూగుల్ లో నార్త్ ఆడియన్స్ రామ్ పోతినేని గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట. త్వ‌ర‌లో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంక‌ర్ 2 చిత్రంతో ప‌ల‌క‌రించబోతున్నాడు. ఈ సినిమాకి అక్క‌డ ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వీలైనంత త్వ‌ర‌గా మూవీని థియేట‌ర్స్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.