Shivraj Kumar | రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్‌డేట్

  • By: TAAZ    cinema    Jul 12, 2025 12:50 PM IST
Shivraj Kumar | రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి మరో అప్‌డేట్

Shivraj Kumar| మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి మరో కీలక అప్ డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్ర లుక్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ‘పెద్ది’ చిత్రంలో ‘గౌర్నాయుడు’గా శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. ఆయన పాత్ర లుక్ చూస్తే గ్రామీణ పెద్దగా మీసాలతో రఫ్ గా సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. శివరాజ్ కుమార్ లుక్ రివీల్ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్ లో ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్‌ శివన్న..మీలాంటి లెజండరీ, సానుకూల దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తితో కలిసి వర్క్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెట్‌లో మీరు ఉన్నారంటే ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని బుచ్చిబాబు పోస్ట్‌ పెట్టారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ పెద్ది సినిమాలో తన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని..సినిమాలో కీలకమైందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ‘గౌర్నాయుడు’ పాత్ర లుక్ కనిపించింది. రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్‌ కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో సాగే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పెద్ది సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.