Mass Jathara: Ole Ole Song | రవితేజ మాస్ జాతర’..‘ఓలే ఓలే’ భలే భలే!

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం నుంచి ‘ఓలే ఓలే’ లిరికల్ వీడియో విడుదలైంది. రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 27న విడుదల కానుంది.

Mass Jathara: Ole Ole Song | రవితేజ మాస్ జాతర’..‘ఓలే ఓలే’ భలే భలే!

Mass Jathara: Ole Ole Song | విధాత: మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’ నుంచి చిత్ర బృందం ‘ఓలే.. ఓలే..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను మంగళవారం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ‘ఓలే ఓలే’ పాటకు భాస్కర్‌ యాదవ్‌ దాసరి సాహిత్యం అందించారు. భీమ్స్‌ సిసిరోలియో, రోహిణి సొర్రాట్‌ ఆలపించారు. ‘ఓలే ఓలే’ పాటలో ధమాకా జోడీ రవితేజ-శ్రీలీల రవితేజలు మరోసారి తమ మాస్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించారు. ఇద్దరూ పోటాపోటీగా స్టెప్పులేసి పాటకు మరింత జోష్ తెచ్చారు. మాస్ ప్రేక్షకులు ఈ పాటకు థియేటర్లు స్టెప్పులేయడం ఖాయంగా కనిపిస్తుంది. ‘మాస్ జాతర’ సినిమా నుంచి గతంలో విడుదలైన మొదటి గీతం ‘తు మేరా లవర్’ కూడా అందరినీ ఆకట్టుకుంది.

ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘మాస్‌ జాతర’ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రవితేజ 75వ చిత్రంగా‘మాస్‌ జాతర’ రాబోతుంది. ఈ మూవీతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.