Sree Leela: శ్రీలీల.. ఇక అంతే సంగతులు! ఆ సినిమాలే కాపాడాలి

Sree Leela:
విధాత: తెలుగు నాట ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి శ్రీలీల (Sreeleela). పెళ్లిసందడీ మొదలు నేటి రాబిన్ హుడ్ వరకు వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఒకదాని తర్వాత ఓకటి చొప్పున వరుసబెట్టి సినిమాలు చేస్తు ఫుల్ జోష్‌లో ఉంది. పుష్ఫ2 సినిమాలో ప్రత్యేక గీతంలో జాతీయ స్థాయిలో మంచి పేరు దక్కించుకుంది. ఈకోవలోనే అయినా తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి ఒకే సారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చింది. అందులో ఒకటి సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం నటించనున్న రెండో చిత్రంతో పాటు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) నటించనున్న ఆషికీ3 చిత్రంలోనూ కథానాయికగా చేస్తోంది.
అయితే తెలుగునాట సినిమాల చేసినన్ని రోజులు శ్రీలీల (Sreeleela) గురించి ఎక్కడ ఎలాంటి ఎలాంటి రూమర్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే సడన్‌గా శ్రీలీలపై రూమర్స్ స్టార్ట్ అయి నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ మధ్య కార్తీక్ ఆర్యన్ ఇంట నిర్వహించిన వేడుకకు శ్రీలీల తల్లితో కలిసి పాల్గొనడం, కార్తీక్‌తో కాస్త కలివిడిగా ఉన్నట్లు వార్తలు బయటకు రావడంతో మీడియాలో ఎక్కడ చూసినా అందుకు సంబంధించిన వార్తలే బాగా వైరల్ అయ్యాయి. దానికితోడు డాక్టర్‌ను నా ఇంటి కోడలుగా వస్తుంది అంటూ కార్తీక్ తల్లి చెప్పిన మాటలు అప్పటికే ఉన్న రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్లైంది.
ఇదిలాఉండగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ బెంగాల్‌లో జరుగుతండగా కార్తీక్ (Kartik Aaryan), శ్రీలీల(Sreeleela)పై ఓ ప్రేమ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ శ్రీలీ, కార్తీక్ ఎదురెదురుగా కూర్చోని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ యూ ఆర్ మై వరల్ట్ ‘తూ మేరీ జిందగీ’ (నువ్వే నా ప్రపంచం) అంటూ సినిమాలోని ఓ పాట పల్లవిని క్యాప్షన్‌గా పెట్టారు. ఆ సీన్‌లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో జరుగుతుందని అనేలా ఉండడంతో శ్రీలీల (Sreeleela), కార్తీక్ (Kartik Aaryan) డేటింగ్ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వస్తుందో.
ఇక శ్రీలల ఇప్పటివరకు పది చిత్రాలు చేసిననప్పటికీ ధమాకా (Dhamaka), భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మినహా ఏ చిత్రం విజయం సాధించకపోవడం ఈ ముద్దుగుమ్మకు, తన కేరీర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల థియేటర్లలోకి వచ్చిన రాబిన్ హుడ్ (Robinhood) సైతం డిజిస్టర్‌గా నిలవడమే కాక శ్రీలీల (Sreeleela) స్క్రిప్ట్ సెలక్షన్స్‌పై సైతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రవితేజ మాస్ జాతర (Mass Jathara), తమిళంలో శివ కార్తికేయన్ పరాశక్తి (Parasakthi) సినిమాలు మాత్రమే ఈ అమ్మడి చేతుల్లో ఉన్నాయి. వీటి జయపజయాలే శ్రీలీల భవిష్యత్తును తేల్చనున్నాయి.