Anushka Shetty|నిర్లక్ష్యమే అనుష్కకి శాపమైందా.. స్వీటీ సినిమాలు తగ్గించడం వెనక కారణం ఇదా?
Anushka Shetty|దక్షిణాది సినిమా రంగంలో అగ్ర హీరోలు చాలా మందే ఉన్నారు. వారికి ధీటుగా కనిపించే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారని చెప్పాలి. హీరోయిన్ గానే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత తమకంటూ ఒక బెంచ్ మార్క్ ని సెపరేట్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సౌత్ సెన్సేషనల్

Anushka Shetty|దక్షిణాది సినిమా రంగంలో అగ్ర హీరోలు చాలా మందే ఉన్నారు. వారికి ధీటుగా కనిపించే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారని చెప్పాలి. హీరోయిన్ గానే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత తమకంటూ ఒక బెంచ్ మార్క్ ని సెపరేట్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సౌత్ సెన్సేషనల్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. ఆమెకి ఒకప్పుడు తెలుగు మార్కెట్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొంత కాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె నుంచి సినిమా వస్తే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నిరూపించింది.అయితే ఒకప్పుడు మిర్చి, బాహుబలి, అరుంధతి, భాగమతి, నిశబ్ధం లాంటి సినిమాలతో అదరగొట్టిన అనుష్క ఈ మధ్య అంతగా సినిమాలు చేయకపోవడం ఏ మాత్రం మింగుడుపడడం లేదు.
సైజ్ జీర్ సినిమా వల్ల అనుష్క కెరీర్ కు బ్రేక్ పడింది. ఈసినిమా కోసం బాగా లావయ్యింది స్వీటి. ఆ తరువాత బరువు తగ్గొచ్చులే అనుకున్నప్పటికీ ఎంత ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదు. కొన్ని సినిమాల కోసం లావు తగ్గాలని ప్రయత్నించి విఫలం అయ్యింది. ఆమె అనుకుంటే చాలు కాని.. అనుష్క స్టార్ డమ్ ఇప్పటికీ అలానే ఉంది. రానా ,ప్రభాస్, గోపీచంద్ లాంటి సిక్స్ ఫీట్ హీరోలకు మంచి జోడీగా సరిపోతుంది అనుష్క. దాదాపు 43 ఏళ్ల వయస్సు వచ్చినా.. గ్లామర్ విషయంలో మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు స్వీటి. అనుకోవాలే కాని అనుష్క మళ్లీ ఫామ్‌లోకి రావడం పెద్ద సమస్యేమి కాదు. త్రిష, నయనతార, దీపికాపదుకునే లాంటి తారలు 40 ఏళ్ళు దాటినా..ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు.
వాళ్ల కన్నా అనుష్కకి ఏం తక్కువ. మంచి చిత్రాలు చేయాలే కాని అనుష్కని తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. నిజానికి అనుష్కలాంటి నటి చేత మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.కాని సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని సంపాదించుకున్న అనుష్క… సినిమాలు చేయకపోవడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అభిమానుల కోసం అయినా అనుష్క మళ్లీ తెరపై కనిపించాలని కోరకుంటున్నారు.